బడ్జెట్ 2020 : ధరలు తగ్గేవి, పెరిగేవి

  • Published By: chvmurthy ,Published On : February 1, 2020 / 10:05 AM IST
బడ్జెట్ 2020 : ధరలు తగ్గేవి,  పెరిగేవి

Updated On : February 1, 2020 / 10:05 AM IST

2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. 

కస్టమ్స్‌ డ్యూటీ పెంపుదలతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపుదలతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు సైతం పెరగనున్నాయి. ఇక వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్‌ సెస్‌, ఆటో మెబైల్‌ విడి భాగాలపై కస్టమ్స్‌ సుంకం పెరిగింది.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్‌ పన్నును సైతం తగ్గించింది. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ వినియోగాదారులకు ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచి ఆర్ధిక వ్యవస్ధ ప్రాధమిక అంశాలుగా రూపొందించిందని ఆర్ధిక మంత్రి తెలిపారు.

ధరలు తగ్గేవి
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
ఎలక్ట్రిక్‌ వాహనాలు
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు
ముడి చక్కెర, 
వ్యవసాయ-జంతు ఆధారిత ఉత్పత్తులు, 
ట్యూనా ఎర, 
చెడిపోయిన పాలు, 
కొన్ని మద్య పానీయాలు, 
సోయా ఫైబర్ ధరలు తగ్గనున్నాయి.

ధరలు పెరిగేవి
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులు వైద్య పరికరాలు
కిచెన్‌లో వాడే వస్తువులు
క్లే ఐరన్‌
స్టీలు
కాపర్‌
దిగుమతి చేసుకునే ఫర్నీచర్‌
వాల్‌ ఫ్యాన్స్‌
టేబుల్‌వేర్
దిగుమతి చేసుకునే చెప్పులు
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్‌ మిల్క్‌
దిగుమతి చేసుకునే వైద్య పరికరాలు