మీ హోం, పర్సనల్, వాహన లోన్స్ వడ్డీరేట్లు తగ్గబోతున్నాయి

కరోనా వైరస్(COVID-19) దేశానికి తాళం వేసేసింది. ఈ దెబ్బకు ఆర్దికవ్యవస్థలో అల్లకల్లోలం.. కరోనా ప్రభావాన్ని తట్టుకోవాలంటే జనం జేబులో డబ్బులుండాలి. అందుకే ఆర్బీఐ..రేపో రేటును ఏకంగా 0.75 మేర తగ్గించింది. అంటే.. 5.15 నుంచి 4.4కు తగ్గింపు. ఇది చాలా ఎక్కువ. ఆర్బీఐ రెపో రేట్లను మార్చడానికి అంత ఇష్టపడదు. 2019లో మాత్రం చురుగ్గా ఉంది, 135 బేజిక్ పాయింట్లను తగ్గించింది.
చూడటానికి రేపోరేట్ బాగా తగ్గినట్లే కనిపిస్తోంది. కాకపోతే హోం లోన్, ఇతర లోన్ల మీద ఎంతటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉంది. టర్మ్ లోన్‌లు తగ్గొచ్చు. RBI తాజా నిర్ణయంతో పర్సనల్ లోన్ వడ్డీరేట్లు తగ్గబోతున్నాయి. ఇక consumer good loans మీదా వడ్డీ తగ్గుతుంది. దీంతో వినియోగదారులకు లాభమే. తగ్గిన రేపో రేటు లాభాన్ని కనుక బ్యాంక్‌లు వినియోగదారులకు బదలాయిస్తే, జనం చేతిలో కాస్త మిగులుతుంది. కొనడం పెరుగుతుంది. దానివల్ల డిమాండ్ పెరిగి మార్కెట్లు కళకళ్లాడతాయి.
దీనికితోడు, బ్యాంక్ లు, housing finance companiesలు మూడునెలల EMIపై మారిటోరియం విధించేలా ఆర్టీఐ ఆదేశించింది. దీనికోసమే మధ్యతరగతి ఆశగా ఎదురుచూస్తోంది. ఇంకో సంగతి, cash reserve ratio (CRR)ని నాలుగు శాతం నుంచి మూడుకు తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్‌లో నిధుల నిల్వ పెరుగుతుంది. కొత్తగా లోన్స్ ఇవ్వగలుగుతారు.
home loan interest rate కనుక 75 బేసిక్ పాయింట్లు తగ్గితే, EMI ,మొత్తం వడ్డీ రేటు మీద ప్రభావం ఎంతుందంటే, మీరు 35 లక్షల హోంలోన్ తీసుకున్నారనుకుందాం. 15 ఏళ్లు గడువు. అప్పుడు మీ EMI మీద మీకు కలిగే లాభం రూ.1533 ( యేడాదికి రూ. 18,396). మొత్తంమీద వడ్డీ తగ్గడం వల్ల కలిగే లాభం.. రూ. 2.76 లక్షలు.