హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభం.. 3 రోజులు నిర్వహణ

CREDAI: వీకెండ్స్‌లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ప్రాపర్టీ షో నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

హైటెక్స్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభం.. 3 రోజులు నిర్వహణ

CREDAI

హైదరాబాద్‌ నగరం నలువైపులా స్థిరాస్తి అభివృద్ధికి ఉన్న అవకాశాలు తెలియజేస్తూ క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ప్రాపర్టీ షో ప్రారంభమైంది.. మూడురోజుల పాటు నిర్వహించే ఈ షోను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.. హైదరాబాద్‌కు చక్కని బ్రాండ్‌ నేమ్‌ ఉందని.. ఈ ఘనతలో నిర్మాణ సంస్థలు, బిల్డర్ల పాత్ర వెలకట్టలేనిదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 90 రోజులు పూర్తయిన తమ ప్రభుత్వం… అన్ని వ్యవస్థలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నారు.

గత ప్రభుత్వం రియాల్టీ రంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని.. ఆ కష్టాలను తమ సర్కార్‌ సరిచేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని… నిర్మాణ రంగంలో ఉన్న వారి సలహాలు, సూచనలు తీసుకుని మార్పులు చేర్పులు చేపడుతామని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌ నగరం డెవలప్‌ అయ్యేందుకు అప్పటి కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన పనులే కారణమన్నారు మంత్రి పొంగులేటి. అంతర్జాతీయంగా హైదరాబాద్‌ అంటే సెక్యులర్‌ అండ్‌ సేఫ్‌ ప్లేస్‌గా రిజిస్టర్‌ అయిందన్నారు. నిర్మాణ రంగ సమస్యలపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని క్రెడాయ్‌ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు.

ప్రాపర్టీలన్నీ ఒకేవేదిక పైకి తెచ్చి ఎంతో ప్రెస్టిజియస్‌గా నిర్వహిస్తోన్న ఈ ప్రాపర్టీ షో ఈనెల 10వరకు జరగనుంది. ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్స్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌ సంబంధిత పరిశ్రమలు, బ్యాంకింగ్‌ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షో … కొనుగోలుదారులు- అమ్మకందారుల డైరెక్ట్‌ కాంటాక్ట్‌కి ఉపయోగపడుతుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. కస్టమర్లకి వారి బడ్జెట్‌లోనే వీలైనంత మెరుగైన ప్రాపర్టీని అందించడానికి సైతం ప్రాపర్టీ షో తన వంతు సాయం చేస్తుందని ఆయన చెప్పారు.

ప్రాపర్టీ షోలో స్టాల్స్‌
రియల్టర్ల దగ్గర నుంచి, నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో… హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణాలోని జిల్లాల నుంచి ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతున్నారని స్టాల్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ రియాల్టీ సెక్టార్ ఫుల్‌ జోష్‌లో ఉంది. హైదరాబాద్‌ సిటీతో పాటు సరౌండింగ్ ఏరియాస్‌లో రియాల్టీ బూమ్‌ హైరేంజ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రాపర్టీస్ వివరాలన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. వీకెండ్స్‌లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ప్రాపర్టీ షో నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

చైనా అయినా, పాకిస్థాన్ అయినా.. వీ డోంట్ కేర్ అంటున్న భారత రక్షణశాఖ