రైతులకు శుభవార్త: రూ.లక్షకే E-ట్రాక్టర్

ఇప్పుడంతా E కాలం నడుస్తోంది. అదేనండీ ఎలక్ట్రానిక్ హవా. ఎలక్ట్రానిక్ వాహనాల కాలం వచ్చేసింది. నో సౌండ్ నో పొల్యూషన్. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..వాటితో పెరిగే వాతావరణ కాలుష్యం వెరసి E వాహనాల డిమాండ్ వచ్చింది. ఫోర్ వీలర్లు, టూ వీలర్లు అంతా ఈ వెహికల్ పై అందరి దృష్టి పడుతోంది. ఈ క్రమంలో వ్యవసాయానికి ముఖ్యమైన వాహనం ట్రాక్టర్ కూడా అదే బాటపట్టింది. త్వరలో మార్కెట్ లోని E ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి.
అస్సోంలోని దుర్గాపూర్‌లోని సీఎస్ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (CMWRI) పరిశోధకులు E ట్రాక్టర్ ను డెవలప్ చేస్తున్నారు. బ్యాటరీతో పనిచేసే ఈ చిన్న ఎలక్ట్రానికి ట్రాక్టర్ 10హెచ్‌పీ సామర్ధ్యం ఉంటుంది. దీని ధర రూ. లక్షకు ఉంటుందని వారు తెలిపారు. రైతుల కోసం దాన్ని మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లుగా సమాచారం.
భారత మార్కెట్‌లో ఇదే అతి తక్కువ ధర ఉండే ట్రాక్టర్ అవుతుంది.ప్రస్తుతం డెవలప్ పొజీషన్ లోనే ఉన్న E-ట్రాక్టర్ ను..సంవత్సరం లోపే తమ పరిశోధనా కేంద్రంలో ట్రయల్ టెస్టింగ్ చేస్తామని సీఎస్ఐఆర్-సీఎంఈఆర్‌ఐ డైరెక్టర్ హరీశ్ హిరానీ తెలిపారు. చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని E-ట్రాక్టర్ రూపొందిస్తున్నామనీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే E-ట్రాక్టర్ బ్యాటరీని ఒకసారి చార్జి చేస్తే..గంట సేపు పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.