Gold Rate Today: బంగారం ఆల్ టైమ్ రికార్డు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు ఎంతో తెలుసా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు..

Gold Rate Today: బంగారం ఆల్ టైమ్ రికార్డు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు ఎంతో తెలుసా..

Gold

Updated On : April 21, 2025 / 2:39 PM IST

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏదైనా బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. అయితే, గత కొద్దిరోజులుగా గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. దీంతో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.లక్షకు చేరువైంది.

GOLD

కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు భారీగా పెంచుతుండగా.. ప్రస్తుత సంక్షోభ సమయంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు.

Gold

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు (31.10గ్రాముల) ధర సోమవారం 3,315 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్​ సిల్వర్​ ధర 32.57 డాలర్లుగా ఉంది. ఇక భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 770 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.700 పెరిగింది. మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. అయితే, గత రెండ్రోజులు గోల్డ్ రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో సోమవారం ఒక్కసారిగా గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.90,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,350 కు చేరుకుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,500కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 90,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.98,350 కు చేరుకుంది.

Gold

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,00గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద కొనసాగుతుంది.

Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.