Gold Rate : హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా? మూడ్రోజులుగా స్థిరంగా వెండి ధర

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా? మూడ్రోజులుగా స్థిరంగా వెండి ధర

Gold

Gold Rate in Hyderabad : గోల్డ్ రేటు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా బంగారం ధర పెరుగుతుంది. అయితే, శనివారం బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో గత కొద్దిరోజులగా ధర పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్న బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి ధరను పరిశీలిస్తే.. శనివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,050 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,240 వద్దకు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,210 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,390.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,050 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,240.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,850 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.75,110.

Gold

స్థిరంగా వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 90,000. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 85,750 వద్దకు చేరింది.

Gold Price Today

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.