Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర .. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో శుక్రవారం కాస్త పెరుగుదల చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర .. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Price Today

Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క పెళ్లిళ్ల సీజన్, మరోపక్క పండుగలు వెరసి ప్రతీ రోజు ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత్ లో మహిళలకు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కాస్తైనా కొనే సంప్రదాయం ఉంది. దీంతో పండుగలైనా..శుభకార్యాలైనా బంగారం కొనటానికి ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం ధరల విషయం తెలుసుకోవటానికి మహిళలు ఆసక్తి చూపుతుంటారు. ఏ రోజు ధరలు ఎలా ఉన్నాయి..? పెరిగాయా..? తగ్గాయా..? కొనటానికి అనువుగా ఉందా..? అనే విషయాలు తెలుసుకుంటుంటారు. ఈ క్రమంలో దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

శుక్రవారం సైతం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారంపై రూ. 100 పెరగ్గా, 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 110 పెరిగింది. స్వల్పంగా పెరిగిన క్రమంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.56,810 కాగా 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.61,970గా ఉంది. వెండి ధర మాత్రం నిలకడగా ఉండి కిలో వెండి ధర రూ.78,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,810 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,970కు చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,960 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,1200కు చేరింది.

– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,810కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 కు చేరింది.

– చెన్నైలో గోల్డ్ ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.51.010 కాగా..24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,210 వద్దకు చేరింది.

వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఓ రోజు పెరిగినా మరో రోజు నిలకడగా ఉండి శుక్రవారం కిలో వెండి రూ.78,000గా ఉంది.