Gold Price Today : మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Price Today : మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Gold Rate

Gold and Silver Latest Prices : బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. గోల్డ్ ధర మరోసారి తగ్గింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి పెరుగుదల చోటుచేసుకోలేదు. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. దీంతో 10గ్రాముల గోల్డ్ ధర రూ. 57,590 వద్దకు చేరింది. మరోవైపు వెండి ధరకూడా తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గుదల చోటు చేసుకుంది.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,830 వద్దకు చేరింది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,740 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,990.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,590 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,830.
    చెన్నైలో 10గ్రాముల బంగారంపై రూ. 60 తగ్గింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,100 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,380గా నమోదైంది.

 

  • తగ్గిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.75,400గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ. 75,400 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.73,900కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,400 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.