Gold Price Today : బాబోయ్.. బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా రెండోరోజు భారీగా పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Price Today : బాబోయ్.. బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Gold Rate

Gold and Silver Latest Prices : బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్.. శనివారం గోల్డ్ ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ. 930 పెరిగింది. ఇంతస్థాయిలో ఒకేరోజు గోల్డ్ ధర పెరగడం చాలా అరుదుగా చూస్తుంటాం. శుక్రవారం 10గ్రాముల ధరపై రూ. 330 పెరగ్గా.. శనివారం ఏకంగా రూ. 930 పెరగడంతో బంగారం ధర అమాంతం మధ్యతరగతి ప్రజలకు అందని ఎత్తుకు దూసుకెళ్లింది. రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై రూ. 1260 పెరిగింది. మరోవైపు వెండిసైతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. శనివారం కిలో వెండిపై రూ. 800 పెరిగింది. దీంతో గురు, శుక్ర, శనివారాల్లో కలిపి మూడు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 1600 పెరిగింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా రెండోరోజు భారీగా పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,090 వద్దకు చేరుకుంది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 64,240.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,750 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 64,090.
    చెన్నైలో 10గ్రాముల బంగారంపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,400 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,720గా నమోదైంది.

Gold

  • భారీగా పెరిగిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.77,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 77,000 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.75,000 కాగా, బెంగళూరులో కిలో వెండి రూ.72,150 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.