Gold Price Today : మరోసారి భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రద్దీగా బంగారం దుకాణాలు

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold Price Today : మరోసారి భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రద్దీగా బంగారం దుకాణాలు

Gold and Silver Price Today : బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఒక్కసారిగా పడిపోయిన ధరలు.. ఇటీవల కాలంలో మళ్లీ పెరుగుతూ వచ్చాయి. తాజాగా మంగళవారం బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.870 తగ్గగా.. కిలో వెండిపై రూ. 3,500 తగ్గింది. భారీగా ధరలు తగ్గడంతో.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,900 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.69,710.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,050 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,860.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.63,900 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,710.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,820 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 87,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.87,500.
కోల్ కతా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 82,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయిలో కిలో వెండి ధర రూ. 82,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 1500 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 83,500 వద్ద కొనసాగుతుంది.

Gold
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.