Gold Price Today : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. పది రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరిగింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Price Today : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. పది రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

Gold

Gold And Silver Price Today : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పది రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది.. గడిచిన పది రోజుల్లో తులం బంగారంపై సుమారు రూ. 3,500 పెరిగింది. తాజాగా శనివారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 540 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 100 పెరిగింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరిగింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,270 మార్క్ వద్దకు చేరింది.

Gold Price Today

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 66,420.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,750 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 66,270.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,500 మార్క్ కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.67,100గా నమోదైంది.

Gold

  • పెరిగిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.79,100 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 79,200 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.75,700 కాగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,000 వద్ద కొనసాగుతుంది.

Gold Rate

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.