Gold prices: ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధర.. ఇలాగైతే కొనేదెలా?
దీంతో 99.9 స్వచ్ఛత గల పసిడి ధర రూ.90,750కు పెరగగా, 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది.

దేశంలో నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో నిన్న సాయంత్రం నాటికి రూ.1,300 చొప్పున బంగారం ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించాలనుకుంటున్న టారిఫ్‌లపై అనిశ్చితి కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొంటున్నాయి. దీంతో 99.9 స్వచ్ఛత గల పసిడి ధర రూ.90,750కు పెరగగా, 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. దాని ధర రూ .90,350గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1.02 లక్షలకు పెరిగింది.
Also Read: గుడ్‌న్యూస్.. అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి బయటకు సునీతా విలియమ్స్.. వీడియో చూశారా?
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చిత వల్ల పెట్టుబడిదారులు పసిడిపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు పెరిగాయి. ఇండియాలో ఈక్విటీ మార్కెట్‌లో జరిగిన కొన్ని మార్పుల వల్ల పసిడి సురక్షితమైన పెట్టుబడి మార్గంగా వ్యాపారులు భావిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి.
ఇందులో ఇతర లోహాలు ఏవీ కలవవు. మృదువుగా, సహజమైన బంగారు రంగును కలిగి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారు నాణేలు, కడ్డీలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక 22 క్యారెట్ల పసిడిలో రాగి, వెండి, జింక్ వంటి లోహాలు ఉంంటాయి. దీంతో దీన్ని 91.67% స్వచ్ఛమైన బంగారంగా లెక్కగడతారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యం పసిడి ధరపై ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతున్న వేళ పసిడిలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మీరు పెట్టుబడి పెట్టాలా? వద్దా? అనేది మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్, ఓపికపై ఆధారపడి ఉంటుంది.