Gold Prices Rising 2024 : దేశంలో పెరుగుతున్న బంగారం ధరలు.. ఇప్పుడు గోల్డ్ కొనాలా? వద్దా? కొన్ని రోజులు ఆగాలా?

Gold Prices Rising 2024 : ధరలు పెరిగినప్పుడు బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? మార్కెట్ ట్రెండ్‌ బట్టి బంగారాన్ని కొనాలా? వద్దా అనేది కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే.. అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.

Gold Prices Rising 2024 : దేశంలో పెరుగుతున్న బంగారం ధరలు.. ఇప్పుడు గోల్డ్ కొనాలా? వద్దా? కొన్ని రోజులు ఆగాలా?

Gold Prices Rising in 2024, Should you buy now or wait

Updated On : January 4, 2024 / 11:58 AM IST

Gold Prices Rising 2024 : కొత్త ఏడాదిలో బంగారం కొనేందుకు చూస్తున్నారా? బంగారం కొనడం అనేది ప్రస్తుత రోజుల్లో భారతీయ సంప్రదాయాల్లో ఒక భాగమైంది. ప్రస్తుత రోజుల్లో అనేక ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. అత్యవసర సమయాల్లోనూ బంగారం ఆదుకుంటుంది. చారిత్రాత్మకంగా బంగారం ఎంతో సురక్షితమైనది.. నమ్మదగిన ఆస్తి కూడా. భారత్‌లో చాలామంది కొంత పరిమాణంలో బంగారాన్ని కలిగి ఉంటారు.

ఆర్థిక అనిశ్చితి లేదా ద్రవ్యోల్బణం సమయంలో బంగారం అండగా నిలబడుతుంది. చాలా మంది పెట్టుబడిదారులచే సంపద సంరక్షణకు ప్రాధాన్యతనిస్తుంది. బంగారాన్ని పోర్టబుల్ లేదా నమ్మదగిన ఆస్తిగా పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సులభంగా లిక్విడేట్ చేసుకోవచ్చు.

Read Also : బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

అనేక కుటుంబాలు తరతరాలుగా ఆభరణాలు లేదా బంగారు నాణేల రూపంలో కూడబెట్టుకునే ఆస్తిగా చెప్పవచ్చు. అయితే, ధరలు పెరిగినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకోవడం అన్నివేళలా మంచిది కాదు. మార్కెట్ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడంతో పాటు ఫలితంగా కలిగే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించడం అవసరం. మీ పెట్టుబడితో కలిగే ప్రయోజనాన్ని తెలుసుకోండి. ప్రత్యామ్నాయ ఎంపికలను కూడా విశ్లేషించండి.

Gold Prices Rising in 2024, Should you buy now or wait

Gold Prices 2024

మీరు పెళ్లి కోసం లేదా పండుగల కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారనుకుందాం.. మీరు అప్పటివరకూ వేచి ఉండకపోవచ్చు. కానీ, మీరు పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేస్తే.. మీరు ధర సెటిల్ అయ్యే వరకు వేచి ఉండవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఆ తర్వాతే బంగారాన్ని కొనుగోలు చేయాలా? వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలి.

మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి :
బంగారం ధరలలో చారిత్రక, ప్రస్తుత పోకడలను విశ్లేషించడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా మార్కెట్ ఊహాగానాల కారణంగా పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోండి. డిమాండ్, సరఫరా ధోరణులను అంచనా వేయండి. పండుగ సీజన్లు, వివాహాలు లేదా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా డిమాండ్ పెరిగితే అది బంగారం ధరల పెరుగుదలకు దారితీయొచ్చు.

ఆర్థిక లక్ష్యాలు :
మీ ఆర్థిక అవసరాలకు తగినట్టుగా బంగారాన్ని కొనుగోలు చేయండి. సంపద సంరక్షణ, పోర్ట్‌ఫోలియో వైవిధ్యం లేదా దీర్ఘకాలిక పొదుపు కోసం బంగారం కొనుగోలు చేయడం మీ పెట్టుబడి వ్యూహంలో సరిపోతుందో లేదో నిర్ణయించండి. మీరు స్వల్పకాలిక లాభాల కోసం ప్లాన్ చేస్తుంటే.. బంగారం ధరల పెరుగుదల సమయంలో కొనుగోలు చేయడం సరైనది కాదు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, హెచ్చుతగ్గులు తక్కువగా ఉండవచ్చు.

చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు :
బంగారాన్ని అధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయండి. లేదంటే.. మీ పెట్టుబడి విలువపై తీవ్ర ప్రభావం పడొచ్చు. అవసరానికి తగినట్టుగా తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. ఏకమొత్త పెట్టుబడికి బదులుగా.. కొనుగోలు ధరను సగటున తగ్గించడానికి కాలక్రమేణా చిన్న మొత్తాలలో బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు.

Gold Prices Rising in 2024, Should you buy now or wait

Gold Prices Rising in 2024

డిజిటల్ గోల్డ్ :
ఇతర పెట్టుబడులపై ఆరా తీయండి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే.. మీ పోర్ట్‌ఫోలియోను వివిధ పెట్టుబడుల వైపు దృష్టిపెట్టండి. మీరు గోల్డ్ ఇటిఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్‌లు వంటి గోల్డ్ బ్యాక్డ్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్‌లను ఎంచుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ మాదిరిగా స్టోర్ అవాంతరాలు లేకుండా డిజిటల్ గోల్డ్ ఓపెన్‌గానే దాచుకోవచ్చు.

ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు :
గోల్డ్ మార్కెట్‌ను సరిగ్గా అంచనా వేయడం సవాలుతో కూడుకున్నదని గుర్తుంచుకోండి. బంగారం మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గుదల చాలా కామన్. బంగారం ధర తగ్గిందని లేదా పెరిగిందని వెంటనే కొనేయొద్దు.. కాస్తా ఓపికపట్టండి. తొందరపడి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారం ధరలను ప్రభావితం చేసే ఆర్థిక సూచికలు, గ్లోబల్ ఈవెంట్‌లపై ఓ కన్నేసి ఉంచండి.

ఇలా చేయడం ద్వారా బంగారం కొనే ముందు సరైన నిర్ణయం తీసుకోవడం ఎల్లప్పుడూ చాలా ఉత్తమం. మీరు బంగారం కొనే ముందు.. మీ ప్రయోజనాల దృష్ట్యా ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ మధ్య ప్రాధాన్యతను అంచనా వేయాలి. బులియన్ మార్కెట్లో అనేక కారణాల వల్ల బంగారం ధరలు మారుతూ ఉంటాయి. మీరు తప్పనిసరిగా మార్కెట్‌ను ట్రాక్ చేస్తుండాలి. బంగారం ధరలను సరిపోల్చండి. మీ బడ్జెట్, అవసరాలకు తగినట్టుగా బంగారాన్ని కొనుగోలు చేయాలి.

Read Also : Gold Price : మూడేళ్లుగా బంగారం ధరల జోరు.. 2024లోనూ ధరలు పెరిగే అవకాశం.. కారణాలు ఇవేనంటున్న నిపుణులు..