మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మూడోరోజు కూడా పెరిగాయి. గురువారం నాటి బంగారం ధరలు రూ. 32,800 మార్క్ ను దాటేశాయి. బులియన్ మార్కెట్ లో ఈ రోజు రూ. 335 మేర పెరిగిన బంగారం ధర ప్రస్తుతం రూ. 32,835 పలుకుతోంది.

బంగారం ధరలు మూడోరోజు కూడా పెరిగాయి. గురువారం నాటి బంగారం ధరలు రూ. 32,800 మార్క్ ను దాటేశాయి. బులియన్ మార్కెట్ లో ఈ రోజు రూ. 335 మేర పెరిగిన బంగారం ధర ప్రస్తుతం రూ. 32,835 పలుకుతోంది.
-
వెండి ధరలు కూడా పైపైకి.. వరుసగా మూడో రోజు
ఢిల్లీ: బంగారం ధరలు మూడోరోజు కూడా పెరిగాయి. గురువారం నాటి బంగారం ధరలు రూ. 32,800 మార్క్ ను దాటేశాయి. బులియన్ మార్కెట్ లో ఈ రోజు రూ. 335 మేర పెరిగిన బంగారం ధర ప్రస్తుతం రూ. 32,835 పలుకుతోంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పైకి ఎగిశాయి. మార్కెట్లో రూ. 350 పెరిగిన వెండి కిలో ధర రూ. 39,700కి చేరింది. కొత్త ఏడాది జనవరి 3వ తేదీతో కలిపి మొదటి మూడు రోజుల్లో బంగారం ధర రూ. 565 పెరిగాయి. మంగళవారం బంగారం ధర రూ. 200 పెరగగా, బుధవారం రోజు రూ. 30 మాత్రమే పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు 99.9 శాతం ప్యూరిటీ (10గ్రా), 99.5 శాతం ప్యూరిటీ (10గ్రా) కలిగి ఒక్కొక్కటిగా రూ. 335 పెరిగాయి. దీంతో బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ. 32,835, రూ.32,685 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరలు పెరగడంతో డాలరు కంటే రూపాయి మారకం విలువ బలహీనపడిందని.. దీని కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయినట్టు వర్తక వ్యాపారులు పేర్కొన్నారు.