Gold Rate Today : బంగారం ధరలకు రెక్కలు.. తొలిసారి 4వేల డాలర్లు దాటేసింది.. ఇండియాలో తులం ఎంతంటే..? హైదరాబాద్‌లో అయితే..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.

Gold Rate Today
Gold Rate Today : బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. రోజురోజుకు గోల్డ్ రేటు (Gold Rate Today) భారీగా పెరుగుతోంది. అమెరికా షట్ డౌన్ కొనసాగడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల తమ నిధులను బంగారం, వెండిపైకి మళ్లించడం ఈ పరిస్థితికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. ఇవాళ (బుధవారం) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రామలు 24 క్యారట్ల బంగారంపై రూ. 1150 పెరిగింది.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1050 పెరిగింది. అయితే, గడిచిన ఐదు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ. 5వేలు పెరిగింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు దూసుకెళ్తోంది. ఔన్సు గోల్డ్ తొలిసారి సరికొత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా.. ఔన్సు గోల్డ్ పై 41 డాలర్లు పెరిగింది.. ఫలితంగా ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,021 డాలర్లకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,12,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,23,170కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,23,320కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,12,900 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,23,170కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,67,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,57,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,67,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.