ChatGPT Go : చాట్‌జీపీటీ యూజర్లకు స్పెషల్ ఆఫర్.. ఈ తేదీ నుంచి ‘ChatGPT Go’ ఫ్రీగా పొందొచ్చు.. ఏకంగా 12 నెలలు ఎంజాయ్ చేయొచ్చు!

ChatGPT Go : భారతీయ చాట్‌జీపీటీ యూజర్లు ఇకపై చాట్‌జీపీటీ గో ప్లాన్ ఉచితంగా యాక్సస్ చేయొచ్చు. అర్హతలు, బెనిఫిట్స్ ఎలా పొందాలంటే?

ChatGPT Go : చాట్‌జీపీటీ యూజర్లకు స్పెషల్ ఆఫర్.. ఈ తేదీ నుంచి ‘ChatGPT Go’ ఫ్రీగా పొందొచ్చు.. ఏకంగా 12 నెలలు ఎంజాయ్ చేయొచ్చు!

ChatGPT Go

Updated On : October 28, 2025 / 7:24 PM IST

ChatGPT Go : చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై చాట్‌జీపీటీ గో ప్లాన్ ఉచితంగా పొందవచ్చు. ఏఐ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కంపెనీ ఓపెన్ఏఐ భారతీయ యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కంపెనీ సరసమైన చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను ఒక ఏడాది (12 నెలలు) పాటు ఉచితంగా అందిస్తుంది.

ఈ ప్రకటనతో ఏఐ జెమిని, పెర్ప్లెక్సిటీ తర్వాత (ChatGPT Go) దేశంలో ఏఐ చాట్‌బాట్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసును ఉచితంగా అందించే రెండో ఏఐ కంపెనీగా ఓపెన్ఏఐ అవతరించింది. కొత్త ఆఫర్ ఏంట? యూజర్లు ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చాట్‌జీపీటీ గో ఆఫర్ ఏంటి? :
చాట్‌జీపీటీ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ ప్రకారం.. భారత మార్కెట్లో ఫస్ట్ ఎక్స్ఛేంజ్ ఈవెంట్‌కు ముందు దేశంలోని ఎక్కువ మందికి ఏఐ బెనిఫిట్స్ అందించేందుకు చాట్‌జీపీటీ గోను ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఫ్రీ చాట్‌జీపీటీ గో ఆఫర్ నవంబర్ 4, 2025 నుంచి ప్రారంభమవుతుంది.

లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సాధారణంగా, చాట్‌జీపీటీ గో ప్లాన్ నెలకు రూ. 399 ఖర్చవుతుంది. GPT-5 ఇతర టూల్స్ యాక్సెస్‌తో అత్యంత చౌకైన ప్లాన్ అందిస్తోంది. అయినప్పటికీ చాట్‌జీపీటీ ప్లస్ కొన్ని ఫీచర్లను ఇప్పటికే తొలగించింది.

Read Also : Google Pixel 10 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు!

ఈ ఆఫర్ ఎలా పొందాలి? :
ఈ ప్రత్యేక డీల్ ప్రకారం.. మీరు చాట్‌జీపీటీ గోకి 12 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ కొత్త చాట్‌జీపీటీ సైన్ అప్‌లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఉన్న చాట్‌జీపీటీ యూజర్లు కూడా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఫ్రీ ఆఫర్‌ను యాక్టివేట్ చేసేందుకు సంబంధించిన పూర్తి ప్రక్రియ రాబోయే కొద్ది రోజుల్లో అధికారిక చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌లో విడుదల కానుందని భావిస్తున్నారు.

ఏఐలో ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్‌కు ఫుల్ డిమాండ్ :
భారత మార్కెట్లో ఏఐ సర్వీసులను ఉచితంగా లేదంటే సరసమైన ధరలకు అందించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఉచితంగా చాట్‌జీపీటీ గోను అందించనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 2025లో భారత్‌లో చాట్‌జీపీటీ గో ప్రారంభమైంది. అయితే, దేశంలోని విద్యార్థులకు గూగుల్ ఇప్పటికే జెమిని ఏఐ ప్రోకు 12 నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

అదేవిధంగా, పెర్ప్లెక్సిటీ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ లేదా Wi-Fi/DTH నెట్‌వర్క్ ఉన్న ఏ యూజరుకైనా ఫ్రీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. ఏఐ కంపెనీల మధ్య ఈ పోటీ భారతీయ యూజర్లకు ప్రీమియం ఏఐ ఫీచర్‌లను సరసమైన ధరకే అందిస్తోంది.