అమెరికా లెగ్ పీస్ లకు మోడీ గ్రీన్ సిగ్నల్

అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 04:53 AM IST
అమెరికా లెగ్ పీస్ లకు మోడీ గ్రీన్ సిగ్నల్

Updated On : November 3, 2019 / 4:53 AM IST

అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం. ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పన్ను కోతకు సంబంధించి పశు సంవర్థక మంత్రిత్వ శాఖతో వాణిజ్య శాఖ చర్చించింది. 

అమెరికా చికెన్ పై ట్యాక్స్ తగ్గిస్తామని అమెరికాలోని హూస్టన్ లో ఇటీవల జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీ అంగీకారం తెలిపారట. అమెరికాలో కోడి మాంసానికి డిమాండ్ ఎక్కువ. అయితే అమెరికన్లు లెగ్ పీసులను ఇష్టపడరు. దీంతో అవి ఇష్టపడే భారత్ వంటి దేశాలకు ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నించింది. అయితే భారత పౌల్ట్రీ పరిశ్రమ గట్టిగా వ్యతిరేకించింది. రూ.లక్ష కోట్ల విలువైన మన పరిశ్రమలో 40 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి అమెరికా చికెన్ తో ఇబ్బందులొస్తాయని పరిశ్రమ భావించింది. 

కాగా, ఇపుడు అమెరికా నుంచి కోడి మాంసం దిగుమతికి మోడీ ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. సాధారణంగా భారత ప్రజలు అప్పటికప్పుడు కోసిన మాంసాన్ని ఇష్టపడతారు. కానీ అమెరికా నుంచి ఏసీ బాక్సుల్లో తెస్తారు. కాబట్టి దేశంలో కొంత మంది మాత్రమే అమెరికా చికెన్ ను ఇష్టపడతారని, భారత పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.