Maruti Suzuki Baleno : కొత్త కారు కొంటున్నారా? మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Baleno Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ లిమిటెడ్-పీరియడ్ స్పెషల్-ఎడిషన్ మోడల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Maruti Suzuki Baleno : కొత్త కారు కొంటున్నారా? మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Maruti Suzuki Baleno Regal edition launched

Updated On : October 17, 2024 / 10:05 PM IST

Maruti Suzuki Baleno Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. బాలెనో మారుతి సుజుకి మోడల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ లిమిటెడ్-పీరియడ్ స్పెషల్-ఎడిషన్ మోడల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బాలెనో రీగల్ ఎడిషన్‌లో బాలెనో జనరల్ మోడల్‌కు భిన్నంగా అప్‌డేట్స్ అందించింది.

బాలెనో 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-వీవీటీ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 89.73పీఎస్ గరిష్ట శక్తిని, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి. 5-స్పీడ్ ఎంటీతో కూడిన సీఎన్‌జీ ఆప్షన్ (77.5పీఎస్, 98.5ఎన్ఎమ్) కూడా ఉంది. బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఆటోమేటిక్ సీఎన్‌జీ వెర్షన్‌లతో సహా అన్ని వేరియంట్‌లు రీగల్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంటుంది.

బాలెనో ధర రూ. 6.66 లక్షలతో మొదలై రూ. 9.83 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో కూడిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల అల్లాయ్‌లు, 360-డిగ్రీ వ్యూ కెమెరా, హెచ్‌యూడీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, సుజుకి కనెక్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ఈ కారులో 40కి పైగా స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. బాలెనో రీగల్ ఎడిషన్ గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, బ్యాక్ డోర్ గార్నిష్, కొత్త సీట్ కవర్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, విండో కర్టెన్, ఆల్-వెదర్ 3డి మ్యాట్‌లను కలిగి ఉంది.

Read Also : WhatsApp Tips : వాట్సాప్‌లో మెసేజ్‌లను ఎలా షెడ్యూల్ చేయాలో తెలుసా?