Maruti Suzuki Eeco Sales : భారత్‌లో మిలియన్ యూనిట్ల సేల్ మైలురాయి చేరిన మారుతి సుజుకి ఈకో..!
Maruti Suzuki Eeco Sales : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) 2010 మోడల్ ఈకో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటినుంచి ఈకో వ్యాన్ అమ్మకాలు జోరుగా కొనసాగాయి.

Maruti Suzuki Eeco reaches 1 million units sales milestone
Maruti Suzuki Eeco Sales : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) 2010 మోడల్ ఈకో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటినుంచి ఈకో వ్యాన్ అమ్మకాలు జోరుగా కొనసాగాయి. ఇప్పుడు ఈకో వ్యాన్ సేల్స్ 1 మిలియన్ యూనిట్ల సేల్ మైలురాయిని చేరుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వ్యాన్‌గా పేరొందిన ఈకో మోడల్.. అదే కేటగిరిలో 94శాతం వాటాను కలిగి ఉంది. ఐదు-సీటర్, సెవెన్-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ మోడల్‌లో 13 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఈ మోడల్ ఈకో వ్యాన్ ధర రూ. 5.22 లక్షల నుంచి రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)లకు లభ్యమవుతుంది. ఈ సుజుకి ఈకోలో 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్, గరిష్టంగా 80.76PS శక్తిని, 104.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో గరిష్టంగా 71.65PS పవర్, 95Nm గరిష్ట టార్క్‌ని అందిస్తుంది. ఆటోమేటిక్ యూనిట్ కోసం ఆప్షన్ లేకుండా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే ఉంది.

Maruti Suzuki Eeco reaches 1 million units sales milestone
మారుతి సుజుకి ఈకో పెట్రోల్ మైలేజ్ లీటరుకు 20.20కిమీగా ఉంది. మారుతి సుజుకి ఈకో CNG మైలేజ్ 27.05కిమీ/కిలో వస్తుంది. Eeco వెనుక కూర్చున్న సీట్లు, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ (A/C వేరియంట్‌లలో), ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS వంటి ఫీచర్లను కలిగి ఉంది. 94శాతం మార్కెట్ వాటాతో వాన్ సెగ్మెంట్‌లో Eeco ఆధిపత్యం చెలాయిస్తోంది.
10 లక్షల మంది కస్టమర్‌ల విశ్వసనీయ ఆప్షన్‌గా నిలిచింది. ఏళ్ల తరబడి అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈకీ వ్యాన్ ముందుకు కొనసాగుతోందని మారుతీ సుజుకీ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. భారత మార్కెట్లో ఆసక్తికరంగా, Eeco మొదటి 5 లక్షల అమ్మకాల మైలురాయికి చేరుకోవడానికి సరిగ్గా 8ఏళ్లు పట్టింది. అయితే, తదుపరి 5 లక్షల విక్రయాల మైలురాయిని ఐదేళ్లలోపు సాధించింది.