Mobile Recharge Plans Hike : మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు.. ఈసారి ఎంతంటే?
Mobile Recharge Plans Hike : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్ళీ పెరగనున్నాయి. జియో, ఎయిర్‌టెల్ ఆపరేటర్లు 10–12శాతం టారిఫ్‌లను పెంచనున్నాయి.

Mobile Recharge Plans Hike
Mobile Recharge Plans Hike : మొబైల్ రీఛార్జ్ ప్లాన ధరలు మళ్లీ పెరగనున్నాయి. గత ఏడాదిలో మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన టెలికం కంపెనీలు మరోసారి రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. అదే జరిగితే.. మొబైల్ రీఛార్జ్ మళ్ళీ ఖరీదైనదిగా మారవచ్చు.
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది (డిసెంబర్) చివరి నాటికి 10 శాతం నుంచి 12శాతం మేర మొబైల్ టారిఫ్‌లను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి మధ్యస్థ, హైర రేంజ్ ప్లాన్ ధరలు పెంచే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
మీరు మొబైల్ మిడ్ లేదా హై రేంజ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే.. ఇది మీకోసమే. జియో, ఎయిర్‌టెల్ వంటి దేశీయ పెద్ద టెలికాం కంపెనీలు ఈ ఏడాదిలో మళ్లీ టారిఫ్‌ను 12శాతం మేర పెంచాలని భావిస్తున్నాయి. గత మేలో మొబైల్ యూజర్ల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించింది. కస్టమర్లు ఇప్పుడు ఖరీదైన ప్లాన్‌లను కూడా తీసుకుంటున్నారు. అయితే, ఈసారి మొబైల్ టారిఫ్ ధరల పెరుగుదల గతంలో కన్నా ఎక్కువ ఖర్చు చేసే వినియోగదారులపై భారం పడనుంది.
మేలో యాక్టివ్ యూజర్ల రికార్డు :
మే 2025లో భారతీయ టెలికం మార్కెట్లో దాదాపు 7.4 మిలియన్ల కొత్త యాక్టివ్ మొబైల్ వినియోగదారులు చేరారు. దేశంలోని మొత్తం యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరుకుంది. రిలయన్స్ జియో మాత్రమే 5.5 మిలియన్లు మంది యూజర్లు కాగా, ఎయిర్‌టెల్ 1.3 మిలియన్ల యూజర్లను చేర్చుకుంది. ఈ రెండింటి యూజర్ల సంఖ్యతో మార్కెట్ వాటాను మరింత పెంచేసింది.
ఈసారి మధ్యస్థ, హై రేంజ్ యూజర్లే టార్గెట్ :
టెలికాం ఇండస్ట్రీ ప్రకారం.. 10 శాతం నుంచి 12శాతం మొబైల్ టారిఫ్ ధరలను పెంచే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఈసారి అది కేవలం బేస్ ప్లాన్‌లకే పరిమితం కాకపోవచ్చు. చివరిసారిగా జూలై 2024లో టారిఫ్ ధరలు పెంచినప్పుడు.. బేసిక్ ప్లాన్‌లు 11 శాతం నుంచి 23 శాతం మేర పెరిగాయి. ఈసారి కంపెనీలు మిడ్, హై రేంజ్ ప్లాన్ యూజర్లనే లక్ష్యంగా చేసుకోనున్నాయి. టారిఫ్ ధరల పెంపుతో కస్టమర్‌లను కోల్పోకుండా మరింత ఆదాయాన్ని పెంచవచ్చు.
ఇప్పుడు టెలికం కంపెనీలు డేటా స్పీడ్, టైమ్ స్లాట్ లేదా డేటా వినియోగం ఆధారంగా ఇప్పుడు వేర్వేరు ధరలతో ప్లాన్‌లను ప్రవేశపెట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. తక్కువ డేటా యూజర్లు లేదా అర్థరాత్రి వాడే యూజర్ల కోసం వేర్వేరు టారిఫ్‌లను పొందవచ్చు.
కస్టమర్‌లు తమ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ప్లాన్‌ను ఎంచుకోనే అవకాశం ఉంటుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ల డేటాలో కూడా భారీగా కోత పెట్టవచ్చు. డేటా ప్యాక్ ప్రత్యేకంగా తీసుకునేలా ఉండనున్నట్టు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 నుంచి 2027 వరకు టెలికాం రంగం ఆదాయాలు రెండంకెలలో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.