ఫీచర్లు అదుర్స్ : Motorola నుంచి రెండు కొత్త ఫోన్లు ఇవే 

  • Published By: sreehari ,Published On : October 25, 2019 / 11:26 AM IST
ఫీచర్లు అదుర్స్ : Motorola నుంచి రెండు కొత్త ఫోన్లు ఇవే 

Updated On : October 25, 2019 / 11:26 AM IST

అమెరికన్ మొబైల్ మేకర్ మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. శుక్రవారం (అక్టోబర్ 25, 2019) లాటిన్ అమెరికన్ మార్కెట్లలో Moto G8 ప్లే, Moto E6 ప్లే స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. లెనోవో సొంత స్మార్ట్ ఫోన్ మేకర్ మోటో G8 ప్లస్, మోటరోలా వన్ మ్యాక్రోను కూడా ప్రకటించింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిగ్మెంట్లకు పోటీగా మోటో G8 ప్లే వెర్షన్ ఒకటి. 

మోటో e6 ప్లే మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ప్రారంభ ధర BRL 1,099 (రూ.19వేల 300)గా నిర్ణయించగా, మోటో e6 ప్లే ధర EUR 108 (రూ.8వేల 500)గా నిర్ణయించింది. మోటో G8లో ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా ఉండగా 13MP ప్రైమరీ కెమెరా బ్యాక్, 8MP వైడ్ యాంగిల్ స్నాపర్, 2MP డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8MP యూనిట్ టియర్ డ్రాప్ నాచ్ తో ఉంది. 

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై రన్ అవుతుంది. ఇది గ్రేడియంట్ బ్లాక్, బ్లాక్ ఓనిక్స్, మ్యాగెంటా రెడ్ కలర్లలో లభ్యం కానుంది. మోటో E6 ప్లే ఫీచర్లలో MediaTek MT 6739 SoCతో పాటు 2GB ర్యామ్, 32GB స్టోరేజీ ఉంది. స్టోరేజీ ఎక్స్ ఫ్యాండ్ చేసేందుకు మైక్రో SD కార్డు సపోర్ట్ ఉంది. 5.5 అంగుళాల HD+ ప్యానల్ బెజిల్స్ తో పాటు సింగిల్ 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ కూడా ఒసియన్ బ్లూ, స్టీట్ బ్లాక్ కలర్లలో లభ్యం అవుతోంది. 

ప్రస్తుతం Moto G8 ప్లే బ్రెజిల్, మెక్సికో, చిలే, పెరూ దేశాల్లో మాత్రమే లభ్యం అవుతోంది. ఇతర లాటిన్ అమెరికన్, యూరోపియన్ మార్కెట్లలో త్వరలో రిలీజ్ కానుంది. Moto E6 ప్లే మోడల్ ఫోన్ బ్రెజిల్, మెక్సికో మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. యూరోప్ లో కూడా నవంబర్ తర్వాత లాంచ్ చేసేందుకు మోటరోలా ప్లాన్ చేస్తోంది. రానున్న నెలల్లో ఆసియా, లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా రిలీజ్ కానుంది.  

Moto G8 play ఫీచర్లు : 
* 6.2 అంగుళాల డిస్ ప్లే 
* ట్రిపుల్ కెమెరా సెటప్ 
* 13MP ప్రైమరీ కెమెరా బ్యాక్
* 8MP వైడ్ యాంగిల్ స్నాపర్, 2MP డెప్త్ సెన్సార్లు
* ఫ్రంట్ కెమెరా 8MP టియర్ డ్రాప్ నాచ్ 
* ఆండ్రాయిడ్ v9.0 pie
* గ్రేడియంట్ బ్లాక్, బ్లాక్ ఓనిక్స్, మ్యాగెంటా రెడ్ కలర్లు
* 4000 mAh బ్యాటరీ సపోర్ట్
* WiFi, Bluetooth, GPS, వోల్టే
* మీడియాటెక్ హెలియో P70 చిప్ సెట్
* అక్టా కోర్ (2.1 GHz, క్వాడ్ కోర్)

Moto E6 play ఫీచర్లు : 
*  5.50 అంగుళాల HD+ (720×1440 ఫిక్సల్స్)
* Mediatek MT6739 SoC
* microSD card సపోర్ట్ (256GB)
*  సింగిల్ 13MP రియర్ కెమెరా + 5MP ఫ్రంట్ కెమెరా 
* ఒసియన్ బ్లూ, స్టీల్ బ్లాక్ కలర్స్ 
* 4G LTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth v4.2, 
* GPS/ A-GPS, FM radio, Micro-USB, 
* 3.5mm హెడ్ ఫోన్ జాక్
* ఫింగర్ ఫ్రింట్ రీడర్
* 3000mAh బ్యాటరీ, బరువు 140 గ్రాములు
* Android 9 Pie ఆపరేటింగ్ సిస్టమ్
* * 2GB RAM + 32GB స్టోరేజీ