Motorola Phone : భలే ఆఫర్ బాస్.. భారీ తగ్గింపుతో మోటోరోలా 5G ఫోన్.. ఇంత తక్కువకు మళ్లీ జన్మలో రాదు..!
Motorola Edge 50 Fusion 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి తక్కువ ధరలో మోటోరో 5G ఫోన్ ఇదిగో.. బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లతో మీ బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Fusion 5G
Motorola Edge 50 Fusion 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో ఏప్రిల్ 2న మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G లాంచ్ కానుంది. ఈ లాంచ్ సందర్భంగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ధర భారీగా తగ్గింది. అమెజాన్ అందించే డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లు ఈ మోటోరోలా 5G ఫోన్ రూ.4వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ఈ విభాగంలో కొన్ని ప్రీమియం స్పెసిఫికేషన్లను కూడా కలిగి ఉంది. 144Hz OLED ప్యానెల్, IP68 సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ కూడా ఉన్నాయి. మీరు రూ. 20వేల కన్నా తక్కువ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే.. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G డీల్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ఫోన్ ధర రూ.20,490కు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన HDFC, BOB, HSBC బ్యాంక్ కార్డులపై కస్టమర్లు రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ 5జీ ఫోన్ ధర రూ.19,500కు తగ్గుతుంది.
కస్టమర్లు నెలకు రూ.993 ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ధరను మరింత తగ్గాలంటే కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. మోడల్, బ్రాండ్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 18,250 వరకు తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు రూ.849కి ఒక ఏడాది అదనపు మొబైల్ వారంటీ, రూ.1,109కి ఒక ఏడాది స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ 10-బిట్ OLED ఎండ్‌లెస్ ఎడ్జ్ డిస్‌ప్లే, HDR10+ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్, అడ్రినో 710 GPU ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు (LPDDR4X) ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజ్‌తో ఉంటుంది.
ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. కెమెరాలలో OISతో కూడిన 50MP సోనీ LYT-700C ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, అలాగే ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.2, NFC, GPS, USB టైప్-C ఉన్నాయి.