NCLAT తీర్పు…టాటా చైర్మన్ గా మిస్రీ

  • Published By: venkaiahnaidu ,Published On : December 18, 2019 / 10:44 AM IST
NCLAT తీర్పు…టాటా చైర్మన్ గా మిస్రీ

టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) బుధవారం(డిసెంబర్-18,2019)ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని ట్రిబ్యునల్ సృష్టం చేసింది. అంతేకాకుండా పబ్లిక్ కంపెనీని ప్రైవేట్ కంపెనీ వైపుగా టాటా గ్రూప్ అడుగులు వేయడం చట్టవిరుద్దమని ఇద్దరు సభ్యుల నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. అయితే టాటా గ్రూప్ చైర్మన్ గా మిస్రీ పునరుద్దరణ ఆదేశాలు నాలుగు వారాల తర్వాతనే అమలు అవుతాయి.అయితే ఈ నాలుగువారాల్లో టాటాలకు ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసుకోవచ్చు.

2012లో టాటా గ్రూప్ చైర్మన్ గా రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చైర్మన్ గా మిస్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే వివిధ ఆరోపణలతో 2016అక్టోబర్ లో మిస్రీని టాటా గ్రూప్ చైర్మన్ గా తొలగించిన విషయం తెలిసిందే. మిస్రీని టాటా గ్రూప్ చైర్మన్ గా తొలగించడాన్ని సవాల్ చేస్తూ సైరస్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ కార్పొరేషన్ అనే రెండు పెట్టుబడిదారీ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను NCLT ముంబై బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మిస్రీ కూడా వ్యక్తిగతంగా NCLTని ఆశ్రయించాడు.

మిస్రీని టాటా గ్రూప్ చైర్మన్ గా తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను NCLAT ముంబై బెంచ్ కొట్టివేస్తూ జులై-9న ఇచ్చిన తీర్పుని మిస్రీ క్యాంప్ సవాల్ చేసింది. మైనార్టీ షేర్ హోల్డర్స్ గా మిస్రీ కుటుంబానికి చెందిన సంస్థలు టాటా సన్స్,రతన్ టాటా,మరికొందరు బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా NCLATని ఆశ్రయించాయి. తన తొలగింపు కంపెనీ చట్టంకి లోబడి జరుగలేదని మిస్రీ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)టాటా గ్రూప్ చైర్మన్ గా సైరన్ మిస్రీని తిరిగి కొనసాగించాలని ఆదేశించింది.