అమెజాన్ లో : కొబ్బరి చిప్ప రూ.1300

ఓ కొబ్బరి చిప్ప ఖరీదు రూ.13 వందలు అంటే నమ్ముతారా..అదీ కూడా  కొబ్బరి లేని ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదు ఇంతేంటి..ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా? కాదండీ బాబు నిజ్జంగా నిజం. ఏంటీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయా...కొబ్బరి చెట్టు..మనం వాడి పడేసిన కొబ్బరి చిప్పలు కళ్లముందు కరెన్సీ నోట్లలా కనిపిస్తున్నాయా..

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 10:33 AM IST
అమెజాన్ లో : కొబ్బరి చిప్ప రూ.1300

Updated On : January 16, 2019 / 10:33 AM IST

ఓ కొబ్బరి చిప్ప ఖరీదు రూ.13 వందలు అంటే నమ్ముతారా..అదీ కూడా  కొబ్బరి లేని ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదు ఇంతేంటి..ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా? కాదండీ బాబు నిజ్జంగా నిజం. ఏంటీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయా…కొబ్బరి చెట్టు..మనం వాడి పడేసిన కొబ్బరి చిప్పలు కళ్లముందు కరెన్సీ నోట్లలా కనిపిస్తున్నాయా..

ఢిల్లీ : ఓ కొబ్బరి చిప్ప ఖరీదు రూ.13 వందలు. అంటే నమ్ముతారా..అదీ కూడా  కొబ్బరి లేని ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదు రూ.13 వందలు. ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా? కాదండీ బాబు నిజ్జంగా నిజం. ఏంటీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయా…కొబ్బరి చెట్టు..మనం వాడి పడేసిన కొబ్బరి చిప్పలు కళ్లముందు కరెన్సీ నోట్లలా కనిపిస్తున్నాయా..మరి ఖాళీ అయిపోయిన కొబ్బరి చిప్పల్ని పడేయమాకండి.  ఎందుకంటే అవికూడా మీకు డబ్బులు సంపాదించే వస్తువైపోవచ్చు..కాదేదీ మార్కెటింగ్ కు అనర్హం కాదని అమెజాన్ మరోసారి నిరూపించింది. మరి  ఆ కొబ్బరి చిప్ప చిత్రం ఏమిటో తెలుసుకుందాం..

 ప్రముఖ ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ లో ఇటీవల నేచురల్ కొకొనట్ షెల్ కప్స్ అన్న ప్రోడక్ట్..దాని కింద ఉన్న రేటు చూసి యూజర్లకు కళ్లు బైర్లు కమ్మాయి. మనం చూసేది నిజమా కాదా అంటు గిల్లి మరీ చూసుకున్నారట. ఈ ప్రోడక్ట్ కిందే ఇది నిజమైన, సహజమైన కొబ్బరి కాబట్టి.. కాస్త పగుళ్లు అవీ ఉండొచ్చంటూ దానికి వివరణ కూడా ఇవ్వటం మరో విశేషం సుమండీ..ఇది చూసి చాలా మంది ఇండియన్స్ షాక్ తిన్నారు. రూ.20 పెడితే ఓ కొబ్బరి కాయ వస్తుంది.. వాటిని కొట్టి చిప్పలు పడేస్తాము.. అలాంటివాటికి నువ్వింత రేటు పెడతావా! ఆయ్..అంటు అమెజాన్‌పై విరుచుకుపడుతున్నారట. 

ఎందుకూ పనికి రాని కొబ్బరి చిప్పకు అందులోను ఖాళీ అయిపోయిన కొబ్బరి చిప్పకు ఇంత రేటు పెట్టడమేంటని ఒకరు..వీటిని కొంటున్న వారిపై జాలి చూపడం తప్ప ఏమీ చేయలేమని మరొకరు కామెంట్ చేశారు. నిజానికి షోరూమ్ ధర రూ.3 వేలు.. కానీ మా ఫ్రెండ్ అమెజాన్‌లో రూ.1300కే కొన్నాడు తెలుసా అంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో కొబ్బరి చిప్ప ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏందబ్బా ఈ వింత అనుకుంటు ముక్కుమీద వేలేసుకుంటున్నారు కొందరు.