Paytm వైస్ ప్రెసిడెంట్‌గా ట్రివాగో అభినవ్

భారత్‌లో ట్రివాగో అంటే తెలియని వాళ్లు లేరు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ట్రివాగోకు అంత బ్రాండింగ్ తెచ్చిపెట్టాడు అభినవ్ కుమార్. అతని మార్కెటింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిపోయిన పేటీఎమ్ అతణ్ని తన ప్రొడక్ట్ మార్కెటింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా సెలక్ట్ చేసుకుంది. అతని మార్కెటింగ్‌తో ఓవర్ నైట్‌లో ట్రివాగో ట్రావెలింగ్ సైట్ ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది.
కొన్ని నెలలుగా ఆ పదవి కోసం జల్లెడ పట్టిన పేటీఎమ్ ఎట్టకేలకు అభినవ్ కుమార్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా అపాయింట్ చేసుకుంది. ‘అభినవ్ కుమార్‌ను బోర్డు సభ్యునిగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రొడక్ట్ మార్కెటింగ్‌లో ఆయన చాలా ఎక్స్‌పర్ట్. మా బిజినెస్‌ను ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాం. దేశంలో డిజిటల్ పేమెంట్స్ అన్నీ పేటీఎమ్ ద్వారానే జరిగే ప్రయత్నం చేస్తున్నాం’ అని పేటీఎమ్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అభినవ్ కుమార్ ఇటలీలోని ట్రెంటో యూనివర్సిటీలో బిజినెస్‍కు సంబంధించిన పీజీ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే ట్రివాగో డిజిటల్ మార్కెటింగ్‍కు సహాయం చేశారు. ఫలితంగా ట్రివాగో ఆయన్ను ఉద్యోగిగా నియమించుకుంది. దీంతో ఆయన మరింత దృష్టి పెట్టడంతో ట్రివాగో బ్రాండ్ ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మార్కెట్ పెంచుకోగలిగింది.