PM-KISAN : పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఇప్పటికీ అందలేదా? ఇలా చేస్తే.. 20వ విడతతో కలిపి అకౌంట్లలో పడొచ్చు..!

PM-KISAN : ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద చాలా మంది రైతులకు ఇంకా 19వ విడత డబ్బులు అందలేదు. అయితే, ఈ విడత ఇంకా వస్తుందా? ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PM-KISAN : పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఇప్పటికీ అందలేదా? ఇలా చేస్తే.. 20వ విడతతో కలిపి అకౌంట్లలో పడొచ్చు..!

PM Kisan Yojana

Updated On : April 10, 2025 / 5:15 PM IST

PM-KISAN 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ పథకం కింద 19వ విడత ఇప్పటికీ అందలేదా? అయితే, మీరు వెంటనే ఈ పనులను పూర్తి చేయండి. సకాలంలో పూర్తి చేసిన రైతులకు నిలిచిపోయిన 19వ విడత వాయిదా డబ్బులు తిరిగి చెల్లించే అవకాశం ఉండొచ్చు.

20వ విడత జూన్‌లో విడుదల కావచ్చు :
అతి త్వరలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. మొదటి విడత వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మీరు పూర్తిగా అర్హులు అయితే రాబోయే విడతతో పాటు నిలిచిపోయిన డబ్బులు పడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. మీరు చేయాల్సిందిల్లా.. పీఎం కిసాన్ సంబంధిత పనులను పూర్తి చేసి ఉండాలి.

Read Also : Honda PCX 160 : యమహా ఏరోక్స్ 155కు పోటీగా కొత్త హోండా PCX 160 స్కూటర్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు, డిజైన్ అదుర్స్..!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేసుకున్న రైతులందరికీ ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందుతుంది. ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో రూ. 2వేల చొప్పున 3 విడతలుగా పడుతుంది.

మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే.. ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతలో, 19వ విడత ప్రయోజనాన్ని ఇంకా పొందని రైతులు చాలా మంది ఉన్నారు. మరి ఈ రైతులు ఇప్పటికీ నిలిచిపోయిన 19వ విడత ప్రయోజనాన్ని పొందగలరా? అంటే.. కచ్చితంగా చెప్పలేం. కానీ, ఈ-కేవైసీ వంటి కొన్ని పనులను పూర్తి చేయడం ద్వారా నిలిచిపోయిన వాయిదాల కోసం సంబంధిత అధికారులను అభ్యర్థించవచ్చు.

19వ వాయిదా ఎప్పుడు విడుదలైంది? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇప్పటివరకు మొత్తం 19 వాయిదాలు జారీ అయ్యాయి. 19వ విడత 2025 ఫిబ్రవరి 24న విడుదలైంది. కోట్లాది మంది రైతులు ఈ విడత ద్వారా ప్రయోజనం పొందారు. కానీ, మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే.. వారి బ్యాంకు ఖాతాలోకి వాయిదాల డబ్బు రాకపోతే.. ఈ విడత నిలిచిపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అవేంటో ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వాయిదాల ఆలస్యానికి  కారణాలివే? :
పీఎం కిసాన్ వాయిదాలు నిలిచిపోవడానికి గల కారణాలు అనేకం ఉండవచ్చు. ఉదాహరణకు.. రైతులు తమ e-KYC పూర్తి చేయకపోవడం, భూమి ధృవీకరణ జరగకపోవడం, ఆధార్ లింక్ చేయకపోవడం, బ్యాంకు ఖాతాలో DBT ఆప్షన్ లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి రైతులు ఈ పథకానికి అనర్హులు అవుతారు.

నిలిచిపోయిన వాయిదా వస్తుందా? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 9 కోట్లకు పైగా అర్హులైన రైతులు 19 వాయిదాల ప్రయోజనం పొందినప్పటికీ, చాలా మంది రైతుల వాయిదాలు నిలిచిపోయాయి. వాయిదాలు నిలిచిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇందుకోసం మీరు పథకం అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ని విజిట్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. లేదంటే కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1551ని సంప్రదించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

నిలిచిపోయిన 19వ వాయిదా ఇప్పుడు అందుతుందా? అంటే.. అందే అవకాశం ఉందనే చెప్పాలి. కానీ, వాస్తవానికి, రైతులు పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తేనే 19వ వాయిదా పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి లబ్ధిదారుల పేర్లను క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ తర్వాత 19వ విడత డబ్బును 20వ విడతతో పాటు అకౌంట్లలోకి పంపే అవకాశం ఉంటుంది.

పీఎం కిసాన్ e-KYC ఎలా పూర్తి చేయాలి? :

  • 19వ విడత డబ్బుల కోసం రైతులు e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
  • PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
  • ‘Farmers Corner’ సెక్షన్ కింద ‘eKYC’ ఆప్షన్ క్లిక్ చేయండి.
  • అవసరమైన ఫీల్డ్‌లో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ‘Search’ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి.
  • ప్రక్రియను పూర్తి చేసేందుకు ‘Submit’పై క్లిక్ చేయండి.

రైతులు తమ ఆధార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ e-KYCని పూర్తి చేసేందుకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయొచ్చు.

Read Also : Inverter vs Non-Inverter AC : వేసవిలో కొత్త ఏసీ కావాలా? ఇన్వర్టర్ ఏసీనా? నాన్-ఇన్వర్టర్ ఏసీనా? ఏది కొంటే బెటర్? కూలింగ్, డబ్బులే కాదు.. పవర్ సేవ్ చేసేది ఇదే..!

పీఎం కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • రైతులు తమ పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయవచ్చు:
  • PM-KISAN వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ‘Farmers Corner’లో, ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ పేమెంట్ స్టేటస్ కోసం ‘Get Data’ పై క్లిక్ చేయండి.