PM Kisan : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చేవారమే 20వ విడత విడుదల? ఖాతాలో రూ. 2వేలు పడగానే ఇలా చెక్ చేయండి..!
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ 20వ విడుదల వచ్చే వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

PM Kisan Samman Nidhi
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan) కింద కేంద్ర ప్రభుత్వం వచ్చేవారమే రూ.2వేలు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఈ విడత ద్వారా కోట్లాది మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందనున్నారు.
అయితే, అర్హత కలిగిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ రూ. 2వేలు అందనున్నాయి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే వెంటనే పూర్తి చేయండి. ప్రస్తుతానికి పీఎం కిసాన్ 20వ విడత విడుదల చేసే తేదీపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, నివేదికల ప్రకారం.. జూలై 14 లోగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు పడతాయని అంచనా వేస్తున్నాయి.
అంతేకాదు.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే పీఎం కిసాన్ 20వ విడత విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారానే నరేంద్ర మోదీ DBT ద్వారా విడత డబ్బును విడుదల చేస్తారు. ప్రభుత్వం చివరిసారిగా పీఎం కిసాన్ పథకం 19వ విడతను 2025 ఫిబ్రవరి 24న విడుదల చేసింది. అప్పటి నుంచి రైతులందరూ 20వ విడత వాయిదా డబ్బు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ, మీకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రూ. 2వేలు పడతాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..
లబ్ధిదారు (PM Kisan) పేరును ఎలా చెక్ చేయాలి? :
- పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- ఆ తరువాత “Farmer Corner” ఆప్షన్ ఎంచుకోండి.
- లబ్ధిదారుల జాబితా ఉన్న సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
- రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- హౌస్ బ్లాక్, గ్రామం వివరాలను కూడా ఎంటర్ చేయాలి.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
- ముందుగా, పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్లాలి.
- మీరు ‘beneficiary status’ ఆప్షన్ క్లిక్ చేయాలి.
- మీకు “Farmer Corner” అనే ఆప్షన్ వస్తుంది.
- మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.