SBI రీసెర్చ్ రిపోర్ట్: వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ఈ మేరకు సోమవారం ఓ నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యలు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ముంబైలో ఫిబ్రవరి 7న సమావేశం కానుంది.
మూడు రోజుల పాటు జరిగే సమావేశంలో పాలసీ విధానంపై ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ‘ఫిబ్రవరి నెలలో RBI తన వైఖరి మార్చుకొంటుందని అంచనా వేస్తున్నాం. 2019 ఏప్రిల్ మాసంలో వడ్డీ రేటులో తొలి కోత ఉంటుందని భావిస్తున్నాం. ఫిబ్రవరి 7నే ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు కోత విధించినా ఆశ్చర్య అక్కర్లేదు’ అని ఎస్‌బీఐ తెలిపింది. గత మూడు ద్వైమాసిక ద్రవ్య విధాన సమావేశాల నుంచి రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు కోత విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. రెపోరేటు మాత్రం రెండుసార్లు 25 బేసిస్ పాయింట్లు పెంచింది.