డైరెక్టర్ పదవికి అంబానీ రాజీనామా

అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అనిల్ అంబానీతోపాటు చెహ్యా విరానీ, రైనా కరాణి, మంజారి కేకర్, సురేశ్ రంగాచార్ ఆర్ కామ్ డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, డైరెక్టర్‌గా మణికంటన్ తన పదవికి రాజీనామా చేశారు.
తమ రాజీనామాలను ఇప్పటికే కంపెనీలోని రుణదాతల కమిటీకి పరిశీలనకు పంపినట్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో RCom అప్పులు చెల్లించలేక దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది.
చట్టబద్ధంగా చెల్లించాల్సిన మొత్తం బకాయిలపై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత బాధ్యతలను కేటాయించడంతో జూలై-సెప్టెంబర్ 2019 నెలల్లో రూ.30వేల 142 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.