Samsung Android 14 : శాంసంగ్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Samsung Android 14 : శాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను మరిన్ని డివైజ్‌లకు విస్తరించింది. గెలాక్సీ ఎ54, గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లో లేటెస్ట్ OS సిస్టమ్‌ అప్‌‌డేట్ రిలీజ్ చేసింది.

Samsung Android 14 : శాంసంగ్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Samsung Android 14

Samsung Android 14 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో గెలాక్సీ ఎ54, గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లు ఉన్నాయి. ఈ ఫోన్ల మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను శాంసంగ్ త్వరితగతిన అనేక డివైజ్‌లకు విస్తరించింది. ఎస్23, ఎస్22 డివైజ్‌లకు కూడా ఇటీవలే అప్‌డేట్‌లను అందించింది.

శాంసంగ్ వన్ యూఐ 6, ఆండ్రాయిడ్ 14తో కలిసి అనేక మోడల్‌లకు దారి తీస్తోంది. గెలాక్సీ ఎ54 అప్‌డేట్ యునైటెడ్ స్టేట్స్‌లోని ఏటీఅండ్‌టీలో ప్రారంభమైంది. అయితే, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్5 అమెరికాలో వెరిజోన్ ద్వారా అప్‌డేట్ మొదట గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్లలోనూ విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆధారితమైన మోడళ్లను ప్రభావితం చేస్తుంది. శాంసంగ్ ఎక్సోనోస్ ఎస్ఓసీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1ని కలిగిన అమెరికా మోడల్‌తో త్వరలో అప్‌డేట్ అందుకోనుంది.

Read Also : Xiaomi Redmi Note 13 Pro : రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ గ్లోబల్ లాంచ్‌పై కొత్త లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

శాంపంగ్ అప్‌డేట్స్ ప్రకారం.. :
వినియోగదారులు ఇంకా నోటిఫికేషన్ అందుకోకుంటే ఆందోళన అక్కర్లేదని కంపెనీ సూచిస్తోంది. ఎందుకంటే.. ఈ అప్‌డేట్ రాబోయే వారాల్లో క్యారియర్‌లు, దేశాలలో ప్రచారం కానుందనిభావిస్తున్నారు. గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈతో సహా కొత్తగా అప్‌డేట్ చేసిన డివైజ్‌లు, స్టేబుల్ ఆండ్రాయిడ్ 14 బిల్డ్‌తో చేసిన లేటెస్ట్ వన్ యూఐ 6 ఫీచర్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. వన్‌యూఐ 6 త్వరిత సెట్టింగ్స్ ప్యానెల్, శాంసంగ్ డెక్స్, లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ మెరుగైన కెమెరా కంట్రోల్ యాక్సస్ అందిస్తుంది. అదనంగా, యూజర్లు శాంసంగ్ కీబోర్డ్‌లో కొత్త విడ్జెట్‌లు లేటెస్ట్ ఎమోజి స్టయిల్ పొందవచ్చు.

Samsung Android 14

Samsung Android 14

నవంబర్ 30న కొత్త అప్‌డేట్ :

శాంసంగ్ మరిన్ని అప్‌డేట్స్ షెడ్యూల్‌ని వివరించింది. గెలాక్సీ ఎ52, గెలాక్సీ ఎ52ఎస్ 5జీ, గెలాక్సీ ఎస్21 ఎఫ్ 5జీ, గెలాక్సీ ఎ72, గెలాక్సీ ఎ13, గెలాక్సీ ఎ23 5జీ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 వంటి డివైజ్‌లు ఈ నవంబర్ 30న వన్ యూఐ 6లో అప్‌డేట్‌ని అందుకోనున్నాయి. గెలాక్సీ ఎ04ఎస్, గెలాక్సీ ఎక్స్‌కవర్ 5, గెలాక్సీ ఎ25 5జీ డిసెంబర్ మొదటి, రెండవ వారాల్లో అప్‌డేట్‌లను అందుకోనుంది.

ఇలా అప్‌డేట్ చేసుకోండి :
ఆసక్తి ఉన్న యూజర్లు శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌లను వన్ యూఐ 6కి అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, డివైజ్‌లో 50 శాతం కన్నా ఎక్కువ బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలి. స్టేబుల్ వై-ఫై లేదా సెల్యులార్ కనెక్షన్ ఉండేలా చూడాలి. కొత్త అప్‌డేట్‌ని చెక్ చేయడానికి Settings > Software Update డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి. వినియోగదారులు రాబోయే వారాల్లో భారత్ వంటి వివిధ దేశాలకు ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రావచ్చు. గెలాక్సీ S23 సిరీస్ ఇప్పటికే భారత్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ అందుకుంది.

Read Also : ChatGPT Voice Feature : చాట్‌జీపీటీలో కొత్త వాయిస్ ఫీచర్.. ఇదేంటి? ఎలా ఉపయోగించాలంటే?