వెండి కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. దీపావళి నాటికి భారీగా పెరిగే ఛాన్స్.. ఎంత పెరుగుతుందంటే.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతో తెలుసా..?

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కిలో వెండిపై 3వేలు పెరిగి గతంలో ఎప్పుడూ లేని విధంగా..

వెండి కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. దీపావళి నాటికి భారీగా పెరిగే ఛాన్స్.. ఎంత పెరుగుతుందంటే.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతో తెలుసా..?

Silver

Updated On : June 6, 2025 / 11:14 AM IST

Silver Price: బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు మళ్లీ రూ. లక్షకు చేరింది. రాబోయే ఐదారు నెలల్లో గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, బంగారం బాటలోనే వెండి పయణిస్తోంది. కొద్దిరోజులుగా వెండి ధర భారీగా పెరుగుతోంది. తద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

Also Read: Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండిపై 3వేలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 1,07,000కు చేరింది. గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ.7,100 పెరిగింది.

వెండి ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీయ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

 

వెండి ధర రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి రూ.1,07,000 స్థాయికి చేరింది. దీపావళి నాటికి రూ.1,20,000కు చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు.