SIP Investment Plan : మీకు జీతం పడిందా? ఇప్పుడే ఇందులో పెట్టుబడి పెట్టండి.. రూ.కోటి సంపాదించడం ఇంత ఈజీనా అంటారు..!
SIP Investment Plan : జీతం డబ్బుల్లో కొంత సేవింగ్స్ చేసుకోండి. ఆ డబ్బులను ఏదైనా సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లలో పెట్టండి. భవిష్యత్తులో మీరు రిటైర్మెంట్ సమయంలో ఈ డబ్బులే మీ అవసరాలను తీరుస్తాయి.

SIP Investment Plan
SIP Investment Plan : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, ఇప్పుడే ఆ డబ్బులు పెట్టుబడి పెట్టండి. భవిష్యత్తులో ఆ డబ్బులే మిమ్మల్నీ కష్టాల్లో ఆదుకుంటాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ వరకు బాగా డబ్బులు కూడబెట్టుకోవాలని భావిస్తుంటారు.
కానీ, మీరు సరైన పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యమని తెలుసుకోవాలి. మీ వయస్సు 35 ఏళ్లు ఉంటే.. మీరు కేవలం 25 ఏళ్లలోనే కోటీశ్వరుడు అవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా నెలకు రూ. 53వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 1 కోటి ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చాలామంది తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని కలలు కంటారు. మీకు కేవలం 35 ఏళ్లు ఉంటే సరైన పెట్టుబడి పెట్టడంతో కొన్ని ఏళ్లలోనే కోట్లు సంపాదించుకోవచ్చు. మీరు ఇంకా ఏదైనా పెట్టబడి పెట్టకపోతే ఇప్పుడు చేయడం మొదలుపెట్టండి. మీ జీతం డబ్బులను మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టండి. రిటైర్మెంట్ సమయానికి మీరు కూడబెట్టిన డబ్బులు రూ. 1 కోటి కార్పస్‌కు చేరుతుంది.
వాస్తవానికి, తక్కువ మొత్తంలో పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. అలాగే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు చివరి రాబడిని చూసి పెట్టడం ఎప్పుడూ సరైనది కాదని గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ స్థిరమైన రాబడిని ఇవ్వవు. మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. 35 ఏళ్లలో వయస్సులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే.. మీరు రిటైర్మెంట్ తీసుకునే సమయానికి రూ. 1 కోటిని సులభంగా సంపాదించవచ్చు.
25 సంవత్సరాల పెట్టుబడితో రాబడి ఎంతంటే? :
మీరు చేయాల్సిందిల్లా.. మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టడమే. మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ప్రకారం.. మీరు ప్రతి నెలా రూ. 5300 మాత్రమే SIP చేస్తే.. మీరు ఏడాదికి సగటున 12శాతం రాబడిని పొందుతారు. అంటే.. రూ. 5300 పెట్టుబడిపై 12శాతం రాబడితో రూ కోటికిపైగా డబ్బులు మీ చేతికి వస్తాయి.
ఒక పెట్టుబడిదారుడు 35 ఏళ్లలో వయస్సులో ప్రతి నెలా రూ. 5300 మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే.. 25 సంవత్సరాలలో ఆ ఫండ్ దాదాపు రూ. 1,00,57,466 వరకు పెరుగుతుంది. ఈ పెట్టుబడిలో మొత్తం రూ. 15,90,000 పెట్టుబడి ఉంటే.. మిగిలిన రూ. 84,67,466 రాబడి 12శాతం వార్షిక రాబడి ఆధారంగా అంచనా వేసిన రాబడిగా లెక్కించాలి. అప్పుడు వడ్డీతో కలిపి అసలు మొత్తంగా మీకు 25ఏళ్లలో రూ. కోటి చేతికి అందుతుంది. ఈ పెట్టుబడి రిటైర్మెంట్ సమయంలో అన్ని అవసరాలకు మీకు ఉపయోగపడుతుంది.
Note : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. SIPలో పెట్టుబడి పెట్టే ముందు ఎవరైనా ఆర్థిక నిపుణుడిని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి.