Sourav Ganguly : పశ్చిమబెంగాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ…మమతా బెనర్జీ ప్రకటన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బిజినెస్ సమ్మిట్‌లో కీలక ప్రకటన చేశారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు మమతాబెనర్జీ ప్రకటించారు....

Sourav Ganguly : పశ్చిమబెంగాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ…మమతా బెనర్జీ ప్రకటన

Sourav Ganguly

Sourav Ganguly : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం బిజినెస్ సమ్మిట్‌లో కీలక ప్రకటన చేశారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు మమతాబెనర్జీ ప్రకటించారు. బెంగాల్ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో మమతా బెనర్జీ మాట్లాడారు.

ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి చర్యలు

బెంగాల్ రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఉద్దేశించిన అనేక చర్యల గురించి సీఎం చెప్పారు. ఎగుమతులను రెట్టింపు చేయడం, లాజిస్టిక్స్‌ను ఆధునీకరించడం, పునరుత్పాదక ఇంధన తయారీని ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ముఖేష్ అంబానీ, సంజీవ్ గోయెంకా, రిషద్ ప్రేమ్‌జీ వంటి వ్యాపారవేత్తలతో కూడిన సమావేశంలో మమతా బెనర్జీ నాలుగు కొత్త పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు గురించి చెప్పారు.

నాలుగు కొత్త పారిశ్రామిక కారిడార్‌లు

ఈ కారిడార్లు దంకుని-కళ్యాణి, తాజ్‌పూర్ పోర్ట్-రఘునాథ్‌పూర్, దంకుని-జార్‌గ్రామ్, దుర్గాపూర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక ప్రాంతాలను ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌కు కలుపుతున్నట్లు సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు. బీజేపీ పాలిత కేంద్రప్రభుత్వం నుంచి తమ రాష్ట్రానికి జీఎస్టీలో వాటా రావడం లేదని సీఎం మమతా ఆవేదనగా చెప్పారు. తాను రైటిజం, లెఫ్టిజంకు అనుకూలంగా లేదని తన వాదం మానవతావాదం అని మమతా చెప్పారు.

ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికం

తాను శాంతి, సంతోషాలను కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌లో వచ్చే మూడేళ్లలో రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడిని డిజిటల్, రిటైల్ విస్తరణ, బయో-ఎనర్జీపై రంగాల్లో పెడతామని చెప్పారు.

ALSO READ : Girl Molestation : దారుణం.. టెన్త్ విద్యార్థినిపై లైంగిక దాడి, పూజకు వెళ్లి తిరిగొస్తుండగా కిరాతకం

ఈ కార్యక్రమంలో విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల విస్తరణ విధానాన్ని కొనియాడారు. రామప్రసాద్ గోయెంకా గ్రూప్‌కు చెందిన సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ, తమ సంస్థ గత కొన్నేళ్లుగా బెంగాల్ రాష్ట్రంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు.