Suryakumar Yadav: కొత్త అవతారంలో సూర్యకుమార్ యాదవ్.. జియోసినిమాతో జట్టు కట్టిన స్కై

Suryakumar Yadav Signs up with JioCinema: ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

Suryakumar Yadav: కొత్త అవతారంలో సూర్యకుమార్ యాదవ్.. జియోసినిమాతో జట్టు కట్టిన స్కై

Updated On : March 14, 2023 / 5:27 PM IST

Suryakumar Yadav Signs up with JioCinema: ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. జియోసినిమా బ్రాండ్ అంబాసిడర్ గా అతడు నియతుడయ్యాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2023 డిజిటల్ స్ట్రీమింగ్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సూర్యకుమార్ నియామకం తోడ్పడుతుందని జియో సినిమా భావిస్తోంది. అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకునే సూర్యకుమార్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడంతో ఫ్యాన్ ఎంగేజ్ మెంట్ పెరుగుతుందని జియో సినిమా అంచనా వేస్తోంది.

పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. గత 18 నెలల కాలంలో మెరుగ్గా రాణించి సత్తా చాటాడు. ఇప్పటివరకు 48 ఇంటర్నేషనల్ టీ20లు ఆడిన స్కై 3 సెంచరీలు, 13 అర్ధసెంచరీలతో 1675 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అతడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

జియోసినిమా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం పట్ల సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 కోసం జియోసినిమాతో జట్టు కట్టడం హ్యాపీగా ఉందన్నాడు. క్రీడాభిమానులకు ప్రపంచస్థాయి నాణ్యతతో డిజిటల్ వీక్షణను అందుబాటులోకి తెస్తోందని తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై స్థిరమైన ఆవిష్కరణలతో వీక్షకులను అలరిస్తున్న జియోసినిమాతో భాగస్వామ్యం పట్ల ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు.

Also Read: ఐపీఎల్ తో డబ్య్లూటీసీ విజయావకాశాలు దెబ్బతింటాయా.. ప్రిపరేషన్ పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

తాము అందించే నాణ్యమైన సేవలకు తగ్గట్టుగానే ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నామని వయాకామ్ 18 స్పోర్ట్స్సీఈవో అనిల్ జయరాజ్ వెల్లడించారు. క్రీడాభిమాలను థ్రిల్ చేసేలా వినోదం అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాగా, మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

Also Read: భయ్యా, నువ్వు కూడా బౌలింగ్ చేస్తే నేనేం చేయాలి..? పుజారాను ప్రశ్నించిన అశ్విన్