TVS Racing Experience Centre : యువ రైడర్ల కోసం టీవీఎస్ రేసింగ్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్.. దేశంలో ఎక్కడో తెలుసా?
TVS Racing Experience Centre : భారతీయ మోటార్ స్పోర్ట్స్ కంపెనీ టీవీఎస్ రేసింగ్ (TVS Racing) మొట్టమొదటి వర్చువల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (Gen-Alpha) ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

TVS Racing launches its experience centre at KidZania Delhi NCR
TVS Racing Experience Centre in Delhi NCR : ప్రముఖ భారతీయ మోటార్ స్పోర్ట్స్ కంపెనీ టీవీఎస్ రేసింగ్ (TVS Racing) యువ ఔత్సాహికులు, రైడర్‌ల కోసం దేశంలో తొలిసారిగా రేసింగ్ అనుభవాన్ని అందించడానికి కొత్త రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. ప్రపంచంలోని ప్రముఖ ఎడ్యుటైన్‌మెంట్ థీమ్ పార్కులలో ఒకటైన కిడ్‌జానియా (KidZania)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ముంబైలోని కిడ్‌జానియాలో టీవీఎస్ రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత, TVS రేసింగ్ అత్యాధునిక TVS రేసింగ్ జోన్‌ను భవిష్యత్తులో కిడ్‌జానియా ఢిల్లీ NCR వద్ద రేసర్‌లకు అందుబాటులోకి తీసుకురానుంది.
TVS రేసింగ్ కిడ్‌జానియాలో మొదటి వర్చువల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. రెండు నెలల పాటు జరిగే ఈ ఛాంపియన్‌షిప్ టీవీఎస్ రేసింగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో రేసింగ్ సిమ్యులేటర్‌లు, అసెంబ్లీ జోన్, డిజైన్, యువ రైడర్‌ల భాగస్వామ్యం, పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉంటుంది. ఎక్స్ పీరియన్స్ సెంటర్ల ద్వారా థ్రిల్లింగ్ ఫీట్‌ను క్రియేట్ చేసే లక్ష్యంతో, ఛాంపియన్‌షిప్ మోటార్ రేసింగ్ పర్యావరణ వ్యవస్థను లోతైన స్థాయిలో ప్రదర్శిస్తుంది.
40ఏళ్లకు పైగా రేసింగ్ వారసత్వంతో TVS రేసింగ్ 1994లో వన్ మేక్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. తద్వారా భారత మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని 4 విభాగాలుగా విస్తరించింది. ఇందులో 13 – 18 ఏళ్ల నుంచి ప్రతిభను పెంపొందించడంపై దృష్టి సారించనుంది. TVS రేసింగ్ 2021 నుంచి దేశంలో 50+ పైగా రూకీ రైడర్‌లకు ట్రైనింగ్ ఇచ్చింది. అదనంగా, TVS రేసింగ్ 2022లో మొట్టమొదటి ఆసియా వన్ మేక్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించింది.

TVS Racing launches its experience centre at KidZania Delhi NCR
ఈ భాగస్వామ్యంపై టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ.. ‘టీవీఎస్ రేసింగ్ నాలుగు దశాబ్దాలుగా భారత మార్కెట్లో రేసింగ్ క్యాంపెయిన్ చేసి విజేతగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సురక్షితమైన థ్రిల్లింగ్ రేసింగ్‌ను మరింత విస్తరించనుంది. రేసింగ్, వీడియో గేమ్‌లతో మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి. కిడ్‌జానియాతో భాగస్వామ్యం ద్వారా పిల్లలకు గొప్ప రేసింగ్ అనుభవాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు.
TVS మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ మాట్లాడుతూ.. ‘కిడ్‌జానియా ముంబైలో ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభించాం. ఢిల్లీ NCR సెంటర్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. TVS రేసింగ్ దేశంలో టూ-వీలర్ రేసింగ్‌ను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ విశిష్ట అనుభవం పిల్లలకు చిరస్మరణీయమైన అనుభూతిని అందిస్తుంది. రేసింగ్ పట్ల పిల్లల్లో మక్కువను ప్రేరేపిస్తుందని భావిస్తున్నాం. ఈ పిల్లల కోసం మొట్టమొదటి TVS రేసింగ్ వర్చువల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.