US Stock Markets: కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. 1974 తర్వాత తొలిసారి అత్యధిక సెషన్లలో నష్టాలు
అమెరికా మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. వరుసగా పదో సెషన్ లోనూ యూఎస్ మార్కెట్లు నేల చూపులు చూశాయి.

US Stock Markets
US Stock Markets Collapsed : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. వరుసగా పదో సెషన్ లోనూ యూఎస్ మార్కెట్లు నేల చూపులు చూశాయి. డౌజోన్స్ 1123, ఎస్ అండ్ సీ 178, నాస్ డాక్ 716 పాయింట్ల నష్టం పోయాయి. 1974 తరువాత అత్యధిక సెషన్లలో అమెరికా మార్కెట్లు నష్టపోవటం ఇదే తొలిసారి. 2023 మార్చి తరువాత యూఎస్ మార్కెట్లు వీక్లీ వరెస్ట్ పర్ఫార్మెన్స్ ను నమోదు చేశాయి. వచ్చే ఏడాది వడ్డీ రేట్లను పరిమితంగానే తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడంతో అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
Also Read: Gold Rate: తగ్గిన ధర.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..