అదిరిపోయే ఫీచర్లు : Vivo iQoo Neo 855 ఫోన్ ఇదే

రోజురోజుకీ కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు పోటాపోటీగా సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేస్తున్నాయి.
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి కొత్త స్మా్ర్ట్ ఫోన్ రిలీజ్ అయింది. iQoo Neo 855 మోడల్ పేరుతో చైనా మార్కెట్లలో ఈ డివైజ్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. గేమింగ్ ఫోకసడ్ iQoo సిరీస్ తో లేటెస్ట్ టెక్నాలజీతో ఆఫర్ చేస్తోంది.
స్నాప్ డ్రాగన్ 855 చిప్ సెట్ తో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Vivo iQoo Neo 855 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్ అందుబాటులో ఉంది. నవంబర్ 1 నుంచి ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ కొత్త సిరీస్ ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
కెమెరాలు :
* ట్రిపుల్ కెమెరా సెటప్ (బ్యాక్)
* డ్యుయల్ ఫిక్సల్ టెక్ తో 12MP ప్రైమరీ కెమెరా
* 8MP వైడ్ యాంగిల్ కెమెరా (f/2.2 అప్రెచర్)
* 2MP కెమెరా (f/1.79 లెన్స్)
* ఫ్రంట్ కెమెరా 12MP సెన్సార్ (f/2.0 లెన్స్)
* డ్యుయల్ ఫిక్సల్ టెక్నాలజీ, AI బ్యూటిఫికేషన్ ఫీచర్లు
* బ్లూ, బ్లాక్, వైట్ మూడు కలర్లు
పనితీరు :
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
* ఫన్ టచ్ OS 9 ఆన్ టాప్
* 6.38 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే (1080x 2340px)
* ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* అక్టా కోర్ క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 855 SoC (2.84GHz)
* అడ్రినో 640 GPU
* 6GB + 8GB ర్యామ్
* 64GB + 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజీ
* 4,500mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 3.5mm ఆడియో జాక్
* Bluetooth, GPS, Wi-Fi 802.11ac, 4G VoLTE
ధర ఎంతంటే? :
* 6GB/64GB వేరియంట్ ధర CNY 1,998 (రూ.20వేలు)
* 6GB/128GB వేరియంట్ ధర CNY 2,298 (రూ.23వేలు)
* 8GB/128GB వేరియంట్ ధర CNY 2,498 (రూ.25వేలు)
* 8GB/256GB వేరియంట్ ధర CNY 2,698 (రూ.27వేలు)