Building Construction: పాత పద్దతులకు గుడ్ బై.. టెక్నాలజీకి వెల్ కం
బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

What are the types of modern methods of construction
Modern Building Construction: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా వ్యయ ప్రయాసతో కూడుకున్న పని. చిన్న ఇల్లు మొదలుపెడితే అది పూర్తయ్యే సరికి ఏ యేడాదో యేడాదిన్నరో అయ్యేది. కానీ ఇప్పుడు నిర్మాణరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా ఇట్టే పూర్తి చేస్తున్నారు. అలా అని గతంలోలా ఐదు అంతస్తులు, పది అంతస్తుల నిర్మాణాలు చాలా తక్కువ. ప్రస్తుతం చాలా రియాల్టీ సంస్థలు 20 నుంచి 50 అంతస్తుల్లో నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాయి. గతం మాదిరి సంప్రదాయ పద్దతిలో నిర్మాణం చేస్తే సమయం చాలా ఎక్కువ పడుతుండటంతో, పాత పద్దతులకు గుడ్ బై చెప్పి, కొత్త టెక్నాలజీకి వెల్ కం చెబుతున్నారు.
ప్రస్తుతం నిర్మాణరంగంలో ప్రాజెక్టు ప్రణాళిక మొదలు అన్ని విభాగాల్లోనూ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం యొక్క నాణ్యత, పర్యవేక్షణ వంటి వాటన్నింటిని సాంకేతికత సాయంతో చాలా సులభంగా పూర్తి చేస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు రకాల సాఫ్ట్వేర్స్ ద్వారా నిర్మాణ ప్రాజెక్టుల డిజైన్, డ్రాయింగ్ తో కావాల్సిన మెటీరియల్, మ్యాన్ పవర్, బడ్జెట్, నిర్మాణ వ్యయంపై ఖచ్చితత్వం వస్తుంది.
బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సాంకేతిక వినియోగంతో నిర్మాణ నాణ్యత పెరుగుతుంది. గతంలో మట్టి, సిమెంటు ఇటుకలతో ఇంటి గోడలను నిర్మించేవారు. కాని ప్రస్తుతం అందుబాటులో ఉన్న మేవాన్ టెక్నాలజీ సాయంతో గోడలు సైతం కాంక్రీట్తో కట్టేస్తున్నారు. దీంతో నాణ్యత పెరగడంతో పాటు త్వరితగతిన నిర్మాణం పూర్తవుతుంది.
Also Read: హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. ఎందుకంటే?
గతంలో నిర్మాణ సామాగ్రి పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యేది. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో అది 90 శాతం మేర తగ్గింది. ఇక నిర్మాణ ప్రాజెక్టులో పనిచేసే పలు విభాగాల బృందాలతో సమన్వయం చేసుకునేందుకు సైతం టెక్నాలజీని వినియోగించడంతో పని సులభతరం అవుతోంది. ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ అమ్మకాల్లో జోరు పెంచిన నిర్మాణరంగం.. ఇప్పుడు కన్ స్ట్రక్షన్లోనూ ఆధునిక సాంకేతికను జోడించి మరింత దూసుకుపోతోంది.