WhatsAppలో కొత్త ఫీచర్ : మెసేజ్ అదే Delete చేస్తుంది

ప్రముఖ వాట్సాప్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ వస్తోంది. అదే.. సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ డిలీట్ మెసేజ్ ఫీచర్. ఈ కొత్త ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ బీటాలో 2.19.348 వెర్షన్ పై కొత్త ఫీచర్ వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్ బాక్సులో మెసేజ్ లు ఎన్నిరోజులు ఉండాలో సెట్ చేసుకోవచ్చు.
సెట్ చేసిన టైమ్ బట్టి ఆటోమాటిక్ గా చాట్ బాక్సులోని మెసేజ్ లన్నీ డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్ పై వాట్సాప్ వర్క్ చేస్తున్నట్టు ఇదివరకే ఓ రిపోర్టు తెలిపింది. గతంలో డిజప్పీయరింగ్ మెసేజస్ ఫీచర్ అనే పేరుతో డార్క్ మోడ్ వాట్సాప్‌లో ఈ ఫీచర్ కనిపించింది. లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ పేరును Delete Messages గా కంపెనీ మార్చేసింది.
Admin యూజర్లు మాత్రమే :
గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.348 డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే APK మిర్రర్ నుంచి కూడా ఈ వెర్షన్ వాట్సాప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Contact Info లేదా లేదా Group Settingsలో ఈ Delete Messages ఫీచర్ కనిపిస్తుంది. Admin యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ Enable చేసేందుకు అనుమతి ఉంటుంది. ఈ ఫీచర్ వర్కింగ్ స్టేజ్‌లో ఉంది.
Time సెట్ చేస్తే చాలు :
లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి యూజర్లకు కనిపించదు. గ్రూపు చాట్ బాక్సులో మెసేజ్ లను ఎన్నిరోజులు, నెల, ఏడాది ఇలా ఎంత సమయం వరకు ఉండాలో పరిమిత సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమాటిక్ గా చాట్ బాక్సు నుంచి మెసేజ్ లు డిలీట్ అయిపోతాయి. ఇందులో One Hour, One Day, One Week, One Month, One Year ఇలా ఏదొకటి సెట్ చేసుకోవచ్చు. స్టేబుల్ వెర్షన్ రిలీజ్ చేశాక.. ఈ ఆప్షన్లు మారే అవకాశం ఉంది.