ఈ రోజు నుంచి మీ ఫోన్లలో WhatsApp పనిచేయదు!

ఈ రోజు (ఫిబ్రవరి 1, 2020) నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. మిలియన్ల స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ ల్లో వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ ఈ నెల నుంచి తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ కాని ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌ల్లో మాత్రమే వాట్సాప్ సపోర్ట్ నిలిపివేస్తోంది కంపెనీ. యూజర్ల భద్రత దృష్ట్యా సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిచిపోయిన ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే డివైజ్ లో మాత్రమే ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయి. స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 2.3.7 అంతకంటే పాత వెర్షన్, ఐఫోన్లలో iOS 8 లేదా అంతకంటే పాత వెర్షన్లలో వాట్సాప్ పనిచేయదు.
ప్రస్తుతం ఈ డివైజ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే యూజర్లు వెంటనే అప్ టేడ్ చేసుకోవాలని, లేదంటే వాట్సాప్ సర్వీసులను వినియోగించుకోలేరని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని నిర్దిష్టమైన డివైజ్ ల్లో (iOS 7) ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యే ఐఫోన్ 4ఎస్ లో కూడా వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది.
దశబ్దకాలంలో వాట్సాప్ అత్యధికంగా నాల్గోవంతు డౌన్ లోడ్ అయిన యాప్ ఒకటిగా నిలిచింది. 2016లోనే వాట్సాప్ కొన్ని సిరీస్ డివైజ్ ల్లో సపోర్ట్ నిలిపివేసింది. డిసెంబర్ 31, 2019 నుంచి అన్ని విండోస్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయిన సంగతి విదితమే.