డిసెంబర్ 2 నుంచి సేల్ : 55 అంగుళాల Xiaomi Mi TV 4K వచ్చేసింది

  • Published By: sreehari ,Published On : November 28, 2019 / 09:35 AM IST
డిసెంబర్ 2 నుంచి సేల్ : 55 అంగుళాల Xiaomi Mi TV 4K వచ్చేసింది

Updated On : November 28, 2019 / 9:35 AM IST

ప్రముఖ చైన్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి ఇండియా మార్కెట్లలో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. Mi TV లైనప్ లో మరో సరికొత్త మోడల్ టీవీని ప్రవేశపెట్టింది. కొన్ని నెలల క్రితమే Mi TV 4X సిరీస్ ను కంపెనీ రిలీజ్ చేసింది. ప్రారంభంలో ఈ మోడల్ టీవీలు మొత్తం 43 అంగుళాలు, 50 అంగుళాలు, 65 అంగుళాలతో మూడు స్ర్కీన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 55 అంగుళాల స్ర్కీన్ సైజుతో లేటెస్ట్ 2020 ఎడిషన్ స్మార్ట్ టీవీని కంపెనీ రిలీజ్ చేసింది. 

మధ్యాహ్నం 12 గంటలకు సేల్ :
ఈ కొత్త స్మార్ట్ టీవీపై డిసెంబర్ 2 నుంచి మధ్యాహ్నం 12గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఇటీవల షియోమీ రిలీజ్ చేసిన Mi TV 4X టీవీల్లో కూడా ఒకే మాదిరి డిజైన్ రావడం చూశాం. ఇందులోని ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. 

కొత్త 2020 ఎడిషన్ Mi టీవీలో OTT యాప్స్ నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీలోని యాప్స్ మాత్రమే కాకుండా బయటి స్ట్రీమింగ్ కంటెంట్ ను కూడా వినియోగదారులు యాక్సస్ చేసుకోవచ్చు. కొత్త ఎంఐ టీవీ రిమోట్ కంట్రలర్‌పై నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో బటన్స్ కూడా చైనీస్ కంపెనీ యాడ్ చేసింది. 

ఫీచర్లు ఏంటంటే? :
Mi TV 4X (55) 2020 ఎడిషన్ మోడల్ ఫీచర్లలో HDR10కు 4K ప్యానల్ సపోర్ట్ చేస్తుంది. షియోమీ Vivid ఫిక్చర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చింది. Dolby Atmos ఆడియో సపోర్ట్ చేయడమే కాకుండా DTS-HD కూడా ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 Pie TV OS తో పాటు ప్యాచ్ వాల్ 2.0 తో రన్ అవుతుంది. క్రోమోక్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేసేలా కంపెనీ డిజైన్ చేసింది. 

ధర ఎంతంటే? :
Mi TV 4X (55) టీవీ ధర రూ.34వేల 999గా ఉంది. ఈ కొత్త స్మార్ట్ టీవీ Mi.com, Mi Home స్టోర్లతో పాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్ సైట్లలో డిసెంబర్ 2 నుంచి సేల్ ప్రారంభం కానుంది. జనవరి 31, 2020 లోగా Mi TV మోడల్ కొనుగోలుచేసిన వినియోగదారులకు కేవలం రూ.1,800 రీఛార్జ్ పై 4 నెలల Airtel DTH కనెక్షన్ పొందవచ్చు. 

Read Also : Daily 3GB డేటా : BSNL 365 Days ప్లాన్ రీఎంట్రీ