తప్పిన ప్రమాదం…ఎంపీ ఇంటిపై బాంబు దాడి

  • Published By: murthy ,Published On : November 25, 2020 / 10:26 AM IST
తప్పిన ప్రమాదం…ఎంపీ ఇంటిపై బాంబు దాడి

Updated On : November 25, 2020 / 11:13 AM IST

AIADMK RS MP Vijayakumar Family survived bomb blast : తమిళనాడులో  అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్, కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉండే అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్ ఇంటి సమీపంలో పేలని బాంబును ఆయన కారు డ్రైవర్ గుర్తించాడు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన కారు డ్రైవర్ కారు సమీపంలోని బాంబును గుర్తించి, ఇంట్లో ఉన్న ఎంపీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లాడు.



వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ వేణుగోపాల్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కాగా….ఎంపీ వేణు గోపాల్ ప్రతిరోజు ఉదయం తెల్లవారుఝూమునే మార్నింగ్ వాక్ కు ఇంటినుంచి కారులో బయటకు వచ్చి సమీపంలోని ప్లే గ్రౌండ్ లో వాకింగ్ చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయనన్ను హతమార్చేందుకు  దుండగులు ఈ ఘతకానికి వ్యూహ రచన చేశారు.
https://10tv.in/modi-rahul-mourn-ahmed-patels-death/
కానీ విజయ్ కుమార్ సోమవారమే ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఒకవేళ బాంబు పేలి ఉంటే కొన్ని మీటర్ల దూరం మేర దెబ్బతిని ఉండేది. బాంబును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడినవారికోసం గాలింపు చేపట్టారు.