Karnataka: తీవ్రంగా కొట్టి మొదటి అంతస్తు నుంచి తోసేసిన టీచర్.. 4వ తరగతి విద్యార్థి మృతి
చనిపోయిన విద్యార్థి పేరు భరత్ కుమార్. నిందితుడైన టీచర్ పేరు ముత్తప్ప. హడ్లిన్లోని ప్రభుత్వ పాఠశాలలలో జరిగిందీ దారుణం. విద్యార్థిపై రాడ్డుతో దాడికి పాల్పడ్డట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దాడి జరిగే క్రమంలో సదరు టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు తన ఆగ్రహాన్ని ఎంతమాత్రం అనుచుకోకుండా కొడుతూనే ఉన్నాడట

Karnataka teacher beats class 4 student to death
Karnataka: మూడు రోజుల క్రితమే దేశ రాజధానిలోని ఒక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిని తీవ్రంగా దాడి చేసి మొదటి నుంచి తోసేసింది ఒక టీచర్. ఈ ఘటన మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో అచ్చం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నాలుగవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని టీచర్ విపరీతంగా కొట్టి మొదటి అంతస్తు నుంచి విసిరేశాడో టీచర్. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందే క్రమంలో విద్యార్థి మరణించాడు. రాష్ట్రంలోని గదగ్ జిల్లాలోని హడ్లిన్ అనే గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Pathaan: కూతురితో కలిసి చూడాలంటూ షారూఖ్‌కు సవాల్ విసిరిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్
చనిపోయిన విద్యార్థి పేరు భరత్ కుమార్. నిందితుడైన టీచర్ పేరు ముత్తప్ప. హడ్లిన్లోని ప్రభుత్వ పాఠశాలలలో జరిగిందీ దారుణం. విద్యార్థిపై రాడ్డుతో దాడికి పాల్పడ్డట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దాడి జరిగే క్రమంలో సదరు టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు తన ఆగ్రహాన్ని ఎంతమాత్రం అనుచుకోకుండా కొడుతూనే ఉన్నాడట. అనంతరం మొదటి అంతస్తు నుంచి తోసేశారట. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో విద్యార్థి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిందితుడు ముత్తప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడట. అతడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.