కరోనా టెస్టు కోసం వచ్చిన అమ్మాయి జనాంగం నుంచి శాంపిల్ తీశాడు

  • Published By: nagamani ,Published On : July 30, 2020 / 04:58 PM IST
కరోనా టెస్టు కోసం వచ్చిన అమ్మాయి జనాంగం నుంచి శాంపిల్ తీశాడు

Updated On : July 31, 2020 / 6:05 PM IST

కరోనా టెస్టుల పేరుతో ఓ ల్యాబ్ టెక్నీషియన్ యువతిపై ఆమెకు తెలికుండానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా టెస్టులు ఎలా చేస్తారో కూడా తెలియని ఓ అమాయకురాలిపై టెక్నీషియన్ చేసిన నీచత్వానికి పాల్పడ్డాడు. కరోనా టెస్టులు ఎలా చేస్తారో చాలామందికి తెలిదు. బ్లడ్ శాంపిల్స్ మాత్రమే తీసుకుంటారని చాలామంది అనుకుంటుంటారు. ఇటువంటి అమాయకులనునమ్మించి పబ్బం గడుపుకునేవారు చాలామంది మోసాలకు..దగాలకు పాల్పడుతున్నారు. అటువంటిదే జరిగింది మహారాష్ట్రలోని అమరావతిలో.

ఓ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతి సహోద్యాగికి కరోనా వచ్చింది. దాంతో ఆమెకు భయపడింది. తనకు కూడా కరోనా వచ్చందేమోనని తెలుసుకోవటానికి కోవిడ్ ట్రామా సెంటర్ ల్యాబ్‌ కు వెళ్లింది. అక్కడ ఉండే టెక్నీషియన్ కు తన గురించి చెప్పింది. ఆమె వాలకం చూసిన సదరు టెక్నీషియన్ కరోనా టెస్ట్ ఎలా చేస్తారో నీకు తెలుసా? అని అడిగాడు. దానికి ఆమె నాకు తెలీదు అని చెప్పింది. దీంతో వాడికి దుర్భుద్ధి పుట్టింది. టెస్ట్ లు చేయించుకున్న తరువాత రిజల్ట్స్ కరెక్ట్ గా త్వరగా రావాలంటే జనాంగం నుంచి కూడా శాంపిల్ తీసుకోవాలని ఆ అమ్మాయిని నమ్మించాడు. నిజమేనేమో అనుకున్న యువతి అందుకు అంగీకరించింది. దీంతో ఆమె మర్మాంగం నుంచి శాంపిల్‌ను సేకరించి పైశాచికానందం పొందాడు.

ఆ తరువాత ఆమె ఈ విషయాన్ని యాదాలపంగా తన సోదరుడికి తెలిపింది. దీంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. డాక్టర్ల వద్దకు వెళ్లి విషయం గురించి తెలుసుకున్నాడు. కరోనా శాంపిళ్లను జనాంగం నుంచి సేకరించరని చెప్పేసరికి తాను మోసపోయిందని..ల్యాబ్‌లో దారుణం జరిగిందని అతడికి అర్థమైంది. అదే మాట చెప్పాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ నీచుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ సదరు టెక్నీషియన్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.