కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

major fire accident at KPHB hyderabad : హైదరాబాద్ కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లిలోని రెమిడి హస్పిటల్ పక్కన ఉన్న ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో హార్డ్‌వేర్, శానిటరీ షాపులో మంటలు రేగినట్లు తెలుస్తోంది. మంటలు క్షణాల్లోనే మొత్తం వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగిసిపడిన మంటల్ని చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదనంగా ఐదు వాటర్ ట్యాంక్‌లను కూడా తరలించారు. ఆరు గంటలుగా శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు.
మంటల ధాటికి బిల్డింగ్ గోడలకు భారీగా పగుళ్లు వచ్చాయి. ఇదే భవంలో సీఎంఆర్ జ్యుయలరీ షాప్ కూడా ఉంది. బిల్డింగ్ పైభాగంలో ఇరుక్కుపోయిన వాచ్‌మెన్‌ను ఫైర్ సిబ్బంది రక్షించారు.