అక్రమ సంబంధానికి అడ్డు చెప్పాడని తండ్రిని హత్య చేసిన కూతురు

  • Published By: murthy ,Published On : August 15, 2020 / 11:08 AM IST
అక్రమ సంబంధానికి అడ్డు చెప్పాడని తండ్రిని హత్య చేసిన కూతురు

Updated On : August 15, 2020 / 11:22 AM IST

కన్నకూతురు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖండించాల్సింది పోయి కూతురు తో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. కూతురు కాపురాన్ని చక్క దిద్దుదామనుకున్నతండ్రి భార్య, కూతురు చేతిలో హతమయ్యాడు.



తమిళనాడు విల్లుపురం సమీపంలోని వడవపాళ్యంకు చెందిన ధనశేఖర్(45) ఆలయ పూజారి. భార్య రాజేశ్వరి(40) కుమార్తె సత్య తో కలిసి జీవిస్తున్నాడు. కుమార్తె సత్యకు వివాహమైన కొద్ది నెలలకే  భర్తనుంచి విడిపోయి పుట్టింటికి వచ్చింది.



సత్య,  భర్తకు బంధువు అయిన పుదుచ్చేరి కి చెందిన మురుగ వేల్(30)తో వివాహేతర  సంబంధం పెట్టుకుంది. దీంతో అతడు తరుచూ వీరింటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన ధనశేఖర్ కుమార్తెను నిలదీశాడు. మంచి పద్దతి కాదని హితవు పలికాడు. ఈ విషయమై భార్య రాజేశ్వరితోనూ గొడవ పడ్డాడు.



ఈ క్రమంలో ఆగస్టు 12వ తేదీ తెల్లవారుఝూమున 1.45 గంటలకు ఇంటికి వచ్చిన ధనశేఖర్ భార్య, కుమార్తెతో మురగవేల్ విషయమై గొడవపడ్డాడు. అనంతరం నిద్రపోయాడు. కుమార్తె అక్రమ సంబంధాన్ని ధనశేఖర్ ప్రశ్నిచటం వారికి నచ్చలేదు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ అతడ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.



నిద్రపోతున్న తండ్రిని సత్య కత్తితో పొడిచింది. భార్య రాజేశ్వరి కత్తిపీటతో భర్త గొంతు కోయటంతో అతను మరణించాడు. మురుగవేల్ ను ఇంటికి రప్పించి హత్య చేసిన ఆనవాళ్లు లేకుండా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజేశ్వరిని, సత్య, మురుగవేల్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముగ్గురిని విల్లుపురం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.