టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం

  • Published By: murthy ,Published On : November 29, 2020 / 01:07 PM IST
టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం

Updated On : November 29, 2020 / 1:47 PM IST

three telangana persons died in road accident in texas : అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతులకు మౌనిక, భరత్‌లు ఇద్దరు సంతానం.

వారి పిల్లలు ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఈ మధ్యనే కూతురు మౌనిక రెడ్డికి అమెరికా లొనే ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో సంబంధం కుదరటంతో పెళ్లి కుదుర్చుకోవడానికి వీరు ఫిబ్రవరిలో అమెరికా వెళ్లారు.



తదనంతరం కరోనా పరిస్ధితుల వల్ల అక్కడే ఉండటం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున నలుగురు వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.texas road accident 1ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మౌనిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చే నెల రిటైర్మెంట్‌ పొందాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో నరసింహారెడ్డి స్వగ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.