‘అమ్మా.. నేను కుర్ కురే ప్యాకెట్ దొంగతనం చేయలేదు.. కానీ నన్ను అందరూ కొట్టారు..‘ పాపం పిల్లాడు లెటర్ రాసి..

ఏం జరిగిందో తెలుసుకోకుండానే తల్లి కూడా తన కొడుకునే తిట్టింది. అంతేకాదు కొట్టింది కూడా. దొంగతనం చేస్తావా అంటూ బాగా అరిచింది.

‘అమ్మా.. నేను కుర్ కురే ప్యాకెట్ దొంగతనం చేయలేదు.. కానీ నన్ను అందరూ కొట్టారు..‘ పాపం పిల్లాడు లెటర్ రాసి..

Updated On : May 23, 2025 / 7:15 PM IST

Boy Incident: పశ్చిమ బెంగాల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కుర్ కురే ప్యాకెట్ పిల్లాడి ప్రాణం తీసింది. దొంగతనం నేరం మోపి తిట్టడంతో ఆ అవమాన భారం తట్టుకోలేకపోయిన బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నాడు.

పశ్చిమ్ మెదినిపూర్ జిల్లా పంకసురలో ఈ ఘటన జరిగింది. పిల్లాడు పేరు క్రిష్ణేందు దాస్. 7వ తరగతి చదువుతున్నాడు. కుర్ కురే ప్యాకెట్ దొంగిలించాడని అతడిని షాపు ఓనర్ తిట్టాడు. అంతేకాదు గుంజీలు కూడా తీయించాడు. ఇక దాస్ తల్లి కూడా అతడిని తిట్టింది. అయితే తాను ఏ తప్పు చేయకపోయినా తనపై దొంగతనం నేరం మోపారని, తనను అవమానించారని, తన తల్లి కూడా తననే తిట్టిందని బాలుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంటికి వెళ్లగానే బలవన్మరణం చేసుకున్నాడు.

దాస్ ఓ షాప్ దగ్గరికి వెళ్లాడు. కుర్ కురే ప్యాకెట్ కొనాలని వెళ్లాడు. అయితే, అక్కడ షాప్ ఓనర్ లేడు. దీంతో.. దాస్ రెండు మూడుసార్ల షాప్ ఓనర్ ని పిలిచాడు. అంకుల్ అంకుల్ అని కేక వేశాడు. కానీ, అతడు అక్కడ లేడు. అదే సమయంలో షాప్ బయట ఓ చిప్స్ ప్యాకెట్ పడి ఉండటాన్ని దాస్ గమనించాడు. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అదే సమయంలో సడెన్ గా షాప్ ఓనర్ సుభాంకర్ దీక్షిత్ అక్కడికి వచ్చాడు.

వెంటనే దాస్ ను అతడు కొట్టాడు, నువ్వు దొంగతనం చేశావు అంటూ అతడిని తిట్టాడు. అంకుల్ నేను దొంగతనం చేయలేదు అని దాస్ చెబుతున్నా అతడు వినలేదు. నేను చాలా సేపు అంకుల్ అని పిలిచాను, ఎవరూ పలకలేదు, దీంతో షాపు ముందర రోడ్డుపై పడి ఉన్న చిప్స్ ప్యాకెట్ ను తీసుకున్నాను అని చెప్పాడు. కానీ, షాప్ ఓనర్ బాలుడి మాటలు వినలేదు. నువ్వు దొంగతనం చేశావు అని పది మందిలో తిట్టాడు. అంతేకాదు.. బాలుడితో బలవంతంగా గుంజీలు కూడా తీయించాడు.

Also Read: ఏపీలో కొత్త రకం కరోనా… తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం..

అదే సమయంలో బాలుడి తల్లి కూడా అక్కడికి చేరుకుంది. ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఆమె కూడా తన కొడుకునే తిట్టింది. అంతేకాదు దాస్ ని కొట్టింది కూడా. దొంగతనం చేస్తావా అంటూ అతడిని బాగా తిట్టింది. నేను దొంగను కాదు, దొంగతనం చేయలేదు అని కొడుకు చెబుతున్నా తల్లి పట్టించుకోలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి వారిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

ఇంటికి చేరుకోగానే.. దాస్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చాలాసేపు వరకు బయటకు రాలేదు. తాను దొంగతనం చేయలేదని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, తనను దొంగ అన్నారని, తనను కొట్టారని దాస్ తీవ్ర మనస్తాపం చెందాడు. పది మందిలో షాప్ ఓనర్ తనను కొట్టడాన్ని ఆ పిల్లాడు తట్టుకోలేపోయాడు. తల్లి కూడా తననే అనడంతో ఆవేదన చెందాడు. మనస్తాపంతో పురుగుల మందు తాగేశాడు.

రూమ్ లోకి వెళ్లిన కొడుకు ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో కంగారుపడిన తల్లి డోర్ తెరవడానికి ప్రయత్నం చేసింది. అయితే డోర్ తెరుచుకోలేదు. దీంతో స్థానికుల సాయంతో డోర్ ను బద్దలు కొట్టింది. లోపల దాస్ నేల మీద పడిపోయి ఉన్నాడు. అతడి పక్కనే పురుగుల మందు డబ్బా ఉంది. దాంతో తల్లి షాక్ కి గురైంది. వెంటనే కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఐసీయూలో బాలుడికి చికిత్స అందించారు. కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

పురుగుల మందు తాగడానికి మందు బాలుడు ఓ లేఖ రాశాడు. ”అమ్మా నేను దొంగను కాదు. నేను చోరీ చేయలేదు. కుర్ కురే కొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ షాప్ ఓనర్ లేడు. ఆయన వస్తాడేమోనని నేను వేచి చూశాను. కానీ, ఆయన రాలేదు. నేను అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో నాకు రోడ్డుపై కుర్ కురే ప్యాకెట్ కనిపించింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఐ లవ్ కుర్ కురే. నేను దొంగతనం చేయకపోయినా నన్ను కొట్టారు, తిట్టారు, అవమానించారు. నాకు చాలా బాధగా ఉంది. చివరగా..పురుగుల మందు తాగినందుకు నన్ను క్షమించు అమ్మా” అని లేఖలో రాశాడు బాలుడు దాస్.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. బాలుడు రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది. అయ్యో.. ఎంత ఘోరం జరిగిపోయింది..అంటూ బోరున విలపిస్తున్నారు.