Cocaine Seized In Mumbai Airport : కడుపులో రూ.13 కోట్ల విలువైన కొకైన్ దాచి తరలింపు .. గుర్తించి పట్టుకున్న అధికారులు
కడుపులో రూ.13 కోట్ల విలువైన కొకైన్ దాచి తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

Cocaine Seized In Mumbai Airport
Cocaine Seized In Mumbai Airport : ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఓ విదేశీయుడు కడుపులో కొకైన్ పెట్టుకుని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సుమారు 13 కోట్లు విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నది. ఓ విదేశీయుడు తన కడుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌ను దాచిపెట్టుకున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి క్యాప్సుల్స్ లో డ్రగ్స్ నింపు కడుపలో దాచి తరలించేందుకు యత్నించాడు. కానీ చాకచక్యంగా వ్యవహరించిన ముంబై కష్టమ్స్ అధికారులు అతనిడిని పరిశీలించి రూ.13 కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.