16 Died In Road Accident : నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 16 మంది మృతి

నేపాల్‌లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 16 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో 24 మందికి తీవ్ర గాయ‌లయ్యారు. స‌మాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు.

16 Died In Road Accident : నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 16 మంది మృతి

road accident (1)

Updated On : October 7, 2022 / 4:46 PM IST

16 Died In Road Accident : నేపాల్‌లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 16 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో 24 మందికి తీవ్ర గాయ‌లయ్యారు. స‌మాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు.

క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి పంపించారు. అయితే, ప్ర‌మాదానికి గురైన వాహ‌నాల వివ‌రాలు, ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. కాగా, నేపాల్‌లో రోడ్డు ప్ర‌మాదాలు ఈ మ‌ధ్య కాలంలో బాగా పెరిగాయి.

Nine Died In Road Accident : విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, టీచర్ సహా 9 మంది మృతి

గ‌త సోమ‌వారం జ‌రిగిన బస్సు యాక్సిడెంట్‌లో కూడా ఇద్ద‌రు ప్ర‌యాణికులు మృతి చెందగా, మ‌రో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.